-

ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ను గెలిపించాలి

9 Nov, 2018 11:05 IST|Sakshi
హుజూర్‌నగర్‌ : మాట్లాడుతున్న రోశపతి

సాక్షి,హుజూర్‌నగర్‌ : రాష్ట్రంలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ను గెలిపించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శీతల రోశపతి అన్నారు. గురువారం స్థానిక అమరవీరుల భవనంలో అక్టోబర్‌ విప్లవం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టులు మాత్రమే ప్రజా పోరాటాల్లో, సమస్యల పరిష్కారంలో ప్రజలకు అండగా ఉంటున్నారన్నారు. ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మహాకూటములను ఓడించాలన్నారు. కార్యక్రమంలో సోమయ్య, కనకయ్య, సీతయ్య, శ్రీను, వెంకటేశ్వర్లు, వెంకన్న, వీరయ్య, లక్ష్మీనారయణ ,చిన్నా ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


బీఎల్‌ఎఫ్‌ గెలిస్తే బహుజనుల రాజ్యం
మేళ్లచెరువు : బీఎల్‌ఎఫ్‌ గెలిస్తే బహుజనుల రాజ్యం వస్తుందని, బీఎల్‌ఎఫ్‌ బలపర్చిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌ను గెలిపించాలని కోరుతూ చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల జనరల్‌బాడీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి వట్టెపు సైదులు మాట్లాడుతూ.. గిరిజనులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లు, డబుల్‌బెడ్‌రూం, మూడు ఎకరాల భూ పంపిణీ వంటి హామీల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమయిందన్నారు. పార్టీ అభ్యర్థిని చట్ట సభల్లోకి పంపినట్లయితే పేదలకు పక్ష పాతిగా సమస్యల పరిష్కారానికి కృషిచేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పల్లె వెంకటరెడ్డి, చింతలపాలెం మండల కార్యదర్శి కందుల సుందరమౌళేశ్వరరెడ్డి, కె.వెంకన్న, వెంకటేశ్వర్లు, భూలక్ష్మి, మరియమ్మ, నారాయణరెడ్డి, సైదా, శ్రీను, వీరబాబు పాల్గొన్నారు.

బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిని గెలిపించాలి:

నేరేడుచెర్ల: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎల్‌ఎఫ్‌ బలపర్చిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్‌రావును గెలిపించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి ఆనగంటి మీనయ్య కోరారు. గురువారం ఆయన పార్టీ ఆధ్వర్యంలో నేరేడుచర్లలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కుంకు తిరపతయ్య, చిన్నయ్య, ఎడ్ల సైదులు, శ్రీను, రంజాన్, వరలక్ష్మి, ఏసు, లలిత, నాగేశ్వరరావు, రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు