తపాలా శాఖ ఉద్యోగులపై సీబీఐ కేసు

4 Sep, 2017 01:32 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాత నోట్లను కమీషన్‌ పద్ధతిలో మార్పిడి చేసిన పోస్టల్‌ శాఖ ఉద్యో గులపై సీబీఐ మరో కేసును నమోదు చేసింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పోస్టల్‌ ఉద్యోగులపై ఆరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ హుమాయూన్‌నగర్‌ సబ్‌ పోస్టాఫీస్‌ లో పనిచేస్తున్న ట్రెజరర్‌ శ్రీనివాస్, పోస్టల్‌ అసిస్టెంట్‌ రాజ్యలక్ష్మి నోట్ల రద్దు సమయంలో ప్రైవేట్‌ వ్యక్తులకు రూ.27.27 లక్షల కొత్త నోట్లను కమీషన్‌ పద్ధతిలో మార్పిడి చేసినట్టు హైదరాబాద్‌ సిటీ డివిజన్‌ సీనియర్‌ సూపరిం టెండెంట్‌ హెచ్‌ఆర్‌ చంద్రశేఖరాచార్‌ సీబీఐకి ఫిర్యాదు చేశారు.

ట్రెజరర్‌ శ్రీనివాస్‌ గతేడాది నవంబర్‌ 11న రూ.15.63 లక్షల పాతనోట్లను మార్పిడి చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజ్యలక్ష్మి గతేడాది నవంబర్‌ 17 నుంచి 24 వరకు ఇన్‌చార్జి ట్రెజరర్‌ బాధ్యతలో ఉండి రూ.11.64 లక్షలకు ధ్రువపత్రాలు లేకుండా నోట్ల మార్పిడి చేసినట్టు తెలిపారు. దీనిపై విచారణ జరిపిన సీబీఐ వారిద్దరిపై పీసీ యాక్ట్‌ 1988 కింద 13(2), రెడ్‌విత్‌ 13(1)డి, ఐపీసీ 409, 468, 471, 477ఏ, 420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు హైదరాబాద్‌ రేంజ్‌ సీబీఐ డీఐజీ చంద్రశేఖర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు