మజ్లిస్‌ కంచుకోటలో పాగా కోసం బీజేపీ, కాంగ్రెస్‌ పోటీ

22 Nov, 2023 08:33 IST|Sakshi

హైదరాబాద్: చార్మినార్  నియోజకవర్గంలో నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు తమ ప్రచారాన్ని విస్తృతం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు మజ్లిస్‌ పార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మజ్లిస్‌ పారీ్టకి చారి్మనార్‌ నియోజకవర్గం కంచుకోటగా ఉంది. ఈసారి జరిగే ఎన్నికల్లో మజ్లిస్‌ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అటు బీజేపీ..ఇటూ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మజ్లిస్‌ పారీ్టకి ధీటుగా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మజ్లిస్‌ పార్టీ అభ్యర్థిగా మాజీ మేయర్‌ మీర్‌ జులీ్ఫకర్‌ అలీ ఎన్నికల బరిలో ఉండగా..బీజేపీ నుంచి మెఘారాణి, కాంగ్రెస్‌ పార్టీ నుంచి మహ్మద్‌ ముజీబుల్లా షరీఫ్‌ పోటీ చేస్తున్నారు.  

అన్ని డివిజన్లలో మజ్లిస్‌ కార్పొరేటర్లు.. 
ఈసారి చార్మినార్ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు టికెట్‌ లభించ లేదు. ఆయన స్థానంలో మాజీ మేయర్‌ మీర్‌ జులీ్ఫకర్‌ అలీకి స్థానం దక్కింది. స్థానికంగా నివాసం ఉండడంతో పాటు గత అనుభవం దృష్ట్యా ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. చారి్మనార్‌ నియోజకవర్గంలోని ఘాన్సీబజార్, పత్తర్‌గట్టి, మొఘల్‌పురా, పురానాపూల్, శాలిబండ తదితర ఐదు డివిజన్లలో మజ్లిస్‌ పార్టీ నాయకులు కార్పొరేటర్లుగా కొనసాగుతున్నారు. ఈ డివిజన్ల పరిధిలోని ఓటర్లందరినీ సంబంధిత కార్పొరేటర్లు క్రమం తప్పకుండా కలుస్తూ ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరుతున్నారు. 

ఘాన్సీబజార్‌ నుంచి .. 
నియోజకవర్గంలోని ఇరువర్గాల ఓటర్లను తమకు మద్దతుగా చేసుకోవడంలో బీజేపీ అభ్యర్థి మెఘారాణి అహరి్నషలు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో బీజేపీకి ఘాన్సీబజార్‌ డివిజన్‌ అండగా ఉంది. ఇక్కడ బీజేపీ నాయకురాళ్లు, కార్యకర్తలు, నాయకులు కొనసాగుతున్నారు. డివిజన్‌లోని అన్ని ప్రాంతాల్లో తమకే ఓట్లు పడే విధంగా నిరంతరం శ్రమిస్తున్నారు. కాగా, ఇదే డివిజన్‌లో కొంత మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పురానాపూల్‌ డివిజన్‌లో సైతం ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.  

విస్తృతంగా కాంగ్రెస్‌ పార్టీ  ప్రచారం.. 
నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన టీపీసీసీ కార్యదర్శి మహ్మద్‌ ముజీబుల్లా షరీఫ్‌ అన్ని స్థాయిల నాయకులను, కార్యకర్తలను పొగేసి తన గెలుపు కోసం ప్రయతి్నస్తున్నారు. నియోజకవర్గంలోని మత పెద్దలతో పాటు స్థానిక నాయకులను కలిసి వారి మద్దతు తీసుకున్నారు. ఇప్పటికే టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలీ మస్కతీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.  

ఉనికి కాపాడుకోవడం కోసం బీఆర్‌ఎస్‌.. 
బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహ్మద్‌ సలావుద్దీన్‌ లోధీ ప్రచారంలో దూసుకుపోతున్నప్పటికీ.. మజ్లిస్‌తో లోపాయికారి ఒప్పందం ఉండడంతో చారి్మనార్‌లో తమ పార్టీ ఉనికి కోల్పోకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థితో స్థానికంగా కొంత మంది సీనియర్‌ నాయ కులు, కార్యకర్తలతో మనస్పర్థలు కొనసాగుతున్నాయి. ఏకంగా అభ్యరి్థని మార్చాలంటూ సమావేశాలు నిర్వహించి పార్టీ అధిష్టానానికి ఫిర్యా దులు చేశారు. వీటన్నింటిని పక్కన పెట్టిన ఆయన పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తూ ఈ ఎన్నికల్లో తనకే ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు