వివాహంతో బాల్యం బందీ   

25 Apr, 2018 14:19 IST|Sakshi
 చైల్డ్‌ లైన్‌ ప్రతినిథి, పరిగి  బాల్య వివాహం చేస్తున్న తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న అధికారులు 

రెండు నెలల్లో వెలుగులోకి 14 వివాహాలు

మారుమూల గ్రామాలు, తండాల్లో అధికం

అవగాహన లోపమే కారణమా?

దోమ : జీవితంలో కొన్ని మధుర ఘట్టాల్లో పెళ్లి ఒక జ్ఞాపకం. తెలిసీ తెలియని వయస్సులో, ఎదిగీ ఎదగని శారీరక, మానసిక స్థితిలో అంటే బాల్యంలోనే పెళ్లి చేస్తే ఆ పెళ్లీ జీవితాన్ని నా శనం చేస్తుంది. చదవును మధ్యలో ఆపేసి, ఆరోగ్యాన్ని నాశనం చేసి, అనేక ఇబ్బందులు కల్పిస్తే అలాంటి పెళ్లిని వదులుకోవాలి. బాల్యంలోనే పెళ్లి చేస్తే కలిగే దుష్పరిణామాలు చాలా ఉంటా యి. గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు కొనసాగుతూనే ఉన్నాయి.

బాల్య వివాహాలను నిర్మూలించాలని ప్రభుత్వం సూచిస్తున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణా లోపం ప్రజల్లో అవగాహన కల్పించకపోవడంతో నేటికీ బాల్య వివాహాలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గంలోని పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూర్‌ నాలుగు మండలాల్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో నిరాక్షరాస్యత, పేదరికం ఎక్కువగా రాజ్యమేలుతోంది. కుల్కచర్ల, దోమ, పరిగి మండలాలలో అధికంగా తండా లు ఉండడంతో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

మారుమూల గ్రామాల్లోనే నిత్యం బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆడుకునే వయస్సులో పెళ్లి పేరిట బాల్యాన్ని బందీ చేస్తున్నారు. బాలికల తల్లిదండ్రులకు ఈ వివాహాలపై కనీస అవగాహనలేక పోవడంతోనే ఇప్పటికీ బాల్య వివాహాలు ఏదో ఒకచోటజరుగుతూనే ఉన్నాయి. 

రెండు నెలల్లో 14 బాల్య వివాహాలు 

పరిగి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే 14 బాల్య వివాహాలు వెలుగులోకి వచ్చాయి. మరి వెలుగులోకి రానివి ఎన్ని ఉన్నాయో?. సమాచారం తెలిస్తేనే చైల్డ్‌లైన్‌ ప్రతినిథులు బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. దోమ మండలంలోని ఉదన్‌రావుపల్లిలో మూడు బాల్య వివాహాలను ఒకేసారి నిలిపేశారు. దోర్నాల్‌పల్లి, మంగలోనిచెల్క తండాల్లో ఒక్కొక్క బాల్య వివాహాలు నిలిపేశారు.

కుల్కచర్ల మండలంలో బండవెల్కిచర్లలో రెండు, బొంరెడ్డిపల్లిలో ఒకటి, పరిగిలో చిల్యాలలో ఒకటి, గోవిందపూర్‌లో ఒకటి, పూడూర్‌లోని కంకల్‌లో ఒకటి, పుడుగుర్తిలో ఒకటి, కొత్తపల్లిలో ఒకటి అంగడిచిట్టంపల్లిలో ఒకటి బాల్య వివాహాలు జరుగుతున్నాయని 1098కి గ్రామస్తులు సమాచారం అందించడం తో చైల్డ్‌లైన్‌ ప్రతినిథులు నిలిపేశారు. 

ప్రజల్లో అవగాహన లేక 

బాల్య వివాహాలు చేస్తే కలిగే అనర్థాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేకనే ఈ వివాహాలు జరుగుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిథులు బాల్య వివాహాలపై మాటలు చెబుతు న్నా గ్రామీణ ప్రాంతల్లో బాల్య వివాహాల ని ర్మూలనకు కఠినంగా వ్యవహరించకపోవడంతో  కొనసాగుతున్నాయి.1098 కాల్‌ చేయండిఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే వెంటనే 1098కు కాల్‌చేసి చెప్పండి. బాల్య వివాహాలు నిర్వహిస్తున్న తల్లిదండ్రుకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రతి గ్రామంలో బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం.     – రాములు.


 

మరిన్ని వార్తలు