నిరుద్యోగులకు సిరికొండ అండ

8 Nov, 2018 13:15 IST|Sakshi

స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి

సాక్షి,రేగొండ: భూపాలపల్లి నియోజక వర్గంలో పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగులకు అండగా నిలుస్తామని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. మంగళవారం మండలంలోని చిన్నకోడెపాక, దామరంచపల్లి, రాజక్కపల్లి, బాలయ్యపల్లె, చెన్నాపురం గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు స్పీకర్‌కు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన రోడ్‌షోలో మధుసూదనాచారి మాట్లాడుతూ కాయలు కాసి ఫలాలను అందించే చెట్టులాంటి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కొంత మంది నరికివేయాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికే గ్రామాల్లో 70 ఏళ్లుగా జరుగని అభివృద్ధి 53 నెలల్లో చేశామన్నారు.

అవినీతి అక్రమాలు చేస్తూ ఆస్తులు, సొంత వ్యాపారాల కోసం కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ఓట్ల కోసం వచ్చే నాయకులకు ఓట్లు వేయొద్దన్నారు. ప్రజల్లో నిత్యం ఉంటూ వారితో మమేకమైన తమను ఆదరించి మరోమారు గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మోడెం ఉమేష్‌గౌడ్, ఎంపీపీ ఈర్ల సదానందం, మాజీ సర్పంచ్‌ మార్క మమత, సుధాకర్, ఎంపీటీసీ సభ్యులు కూనూరి సదానందం, పీఎసీఎస్‌ చైర్మన్‌ గోపు భిక్షపతి, నాయకులు పున్నం రవి, మైస భిక్షపతి, సంతోష్, రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్,  శ్రీధర్‌గౌడ్, బలేరావు మనోహర్‌రావు, కిరణ్, తిరుపతి,  గ్రామ కమిటి అ«ధ్యక్షులు బొమ్మరాజు సుధాకర్, పెరమాండ్ల చక్రపాణి,  రమేష్, వీవర్స్‌ సోసైటీ చైర్మన్‌ అశోక్,  సాంబయ్య, కుమార్, మొండయ్య, సారయ్య, నాగపూరి పరమేశ్వర్, అశోక్, అశోక్, మమత, మల్లెబోయిన భిక్షపతి, బాబురావు, కృష్ణారెడ్డి, ఎడ్డే స్వాతి, రాజ్‌కుమార్, నీలాంబ్రం, దాస్‌  తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు