‘మినిస్టర్స్‌’ క్వార్టర్స్‌లోనే ఉండాలి

29 Sep, 2019 03:05 IST|Sakshi

మంత్రులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రులంతా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నివాసముంటూ సామాన్య ప్రజలు, సందర్శకులకు అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ప్రస్తుత సచివాలయ భవనాలను కూల్చివేసి కొత్తగా సమీకృత సచివాలయ భవన సముదాయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయ శాఖలను బీఆర్‌కేఆర్‌ భవన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ని ప్రభుత్వ విభాగాల భవనాలకు తరలించ డం పూర్తయింది.

ఆదివారం నుంచి సచివాలయం ప్రధాన ద్వారానికి తాళాలు వేసేయాలని, అవసరమున్న అధికారులు తాళం చెవులను రాష్ట్ర ప్రభుత్వ సీఎస్‌ ఎస్‌కే జోషి అనుమతితో తీసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో మంత్రులను కలుసుకునేందుకు వచ్చే సామాన్యు లు అసౌకర్యానికి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు తప్పనిసరిగా మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో నివాసముంటూ సందర్శకులను కలుసుకోవాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది.

మంత్రులకు తాత్కాలిక పేషీలు.. 
సచివాలయం ఖాళీ కావడంతో పేషీలు కోల్పోయిన రాష్ట్ర మంత్రులకు ప్రభుత్వం తాత్కాలిక కార్యాలయాలను కేటాయించింది. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో కార్యాలయాలు కేటాయించారు. మిగిలిన మంత్రులకు వారి శాఖల పరిధిలోని విభాగాల భవనాల్లో కార్యాలయాలను కేటాయించారు.

మరిన్ని వార్తలు