కాసులకు కక్కుర్తి పడి గర్భసంచి ఆపరేషన్లు

5 Apr, 2016 04:52 IST|Sakshi

కరీంనగర్ జిల్లా దూలూరులో 200 మందికిపైగా బాధితులు
 
 కథలాపూర్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలంలో అనవసరపు ఆపరేషన్ల వ్యవహారం వెలుగుచూసింది.  కొంతమంది వైద్యులు, ఆర్‌ఎంపీలు, పీఎంపీలు కాసుల కక్కుర్తితో అడ్డగోలుగా అపెండిసైటిస్ ఆపరేషన్లు చేయడం రాష్ట్రంలో సంచల నం సృష్టించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు  తెలంగాణ వైద్యమండలి, వైద్య, ఆరోగ్యశాఖ విచారణ జరుపుతున్నారుు. ఈ క్రమంలో మండలంలోని దూలూ రులో గర్భసంచి ఆపరేషన్ల తొలగింపు విషయం వెలుగులోకి వచ్చింది. 200 మందికిపైగా బాధితులు ఉన్నట్లు తెలిసింది.

 అంతా 40 ఏళ్ల లోపు వారే : మహిళలకు 45 ఏళ్ల పైబడిన తర్వాత గర్భసంచికి సంబంధించిన ఏదైనా ఆరోగ్య సమస్యలుంటేనే వారికి ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించాల్సి ఉం టుందని వైద్యులు పేర్కొంటున్నారు. దూలూర్‌లో  1,800 మంది జనాభా ఉండగా మహిళలు 700 మంది ఉన్నారు. ఇందులో 25 నుంచి 40 ఏళ్లలోపు వారు 350 మంది మహిళలు ఉన్నట్లు స్థానిక అధికారులు చెప్పారు. 30 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న మహిళలకే గర్భసంచి తొలగింపు ఆపరేషన్లు జరిగినట్లు తేలింది. గర్భసంచి తొలగింపు ఆపరేషన్‌కు రూ.30వేల వరకు ప్రైవేట్ ఆస్పత్రిలో వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.  కేసులు తీసుకొచ్చిన గ్రామీణ వైద్యుడికి రూ.10వేల చొప్పున కమీషన్ ఇచ్చినట్లు సమాచారం. గర్భసంచి తొలగింపు ఆపరేషన్లపైనా విచారణ నిర్వహిస్తే మరిన్ని విషయూలు బహిర్గతమయ్యే అవకాశముంది.

మరిన్ని వార్తలు