దళితుడైతే దాడులు మర్చిపోతారా?

22 Jun, 2017 03:02 IST|Sakshi
దళితుడైతే దాడులు మర్చిపోతారా?

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌..
జనరల్‌ స్థానాల్లోనూ ఎస్సీ, ఎస్టీలకు టికెట్లు: కిశోర్‌ చంద్రదేవ్‌
ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ముఖ్యులతో టీపీసీసీ శిక్షణా శిబిరం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నేతను పోటీకి పెడితే వారిపై జరుగుతున్న దాడులను మరచిపోతారా అని టీపీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం లోని ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల ముఖ్యనేత లతో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణా శిబిరం హైదరాబాద్‌లో బుధవారం జరిగిం ది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో కొంత బలహీనపడిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో ఓడి పోవడంపై సమీక్షించుకుని, తిరిగి బలోపేతం కావడానికి పనిచేయాలని సూచించారు. పంజాబ్‌లో అమలు చేసిన విధానం సత్ఫలి తాలిచ్చిందని, అదే మోడల్‌ను రాష్ట్రంలోనూ అమలు చేయనున్నట్లు తెలిపారు. దళితులను బీజేపీ, టీఆర్‌ఎస్‌ మోసం చేస్తున్నాయని విమ ర్శించారు.

సీఎం కేసీఆర్‌ ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఎస్టీలకు మొదటి సంతకంతోనే రిజర్వేషన్లు ఇస్తామని ఇంకా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నిం చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పింఛను 1,500 కు పెంచుతామని, నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లిస్తామని, అదనంగా మరో గది ఇస్తామని చెప్పారు. సమర్థులైన ఎస్సీ, ఎస్టీ లకు కూడా జనరల్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ నుంచి అవకాశాలు న్నాయని ఏఐసీసీ ఆదివాసీ విభాగం చైర్మన్, కేంద్ర మాజీమంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ చెప్పా రు.

ప్రాంతీయ పార్టీలు.. ప్రాంతీయతత్వాని కి, సంకుచిత ప్రయోజనాలకే పరిమితమ వుతాయని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రం లో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. యూపీఏ పథకాలకు పేర్లు మారుస్తూ ప్రధాని మోదీ ప్రభుత్వం ఒట్టి ప్రచారం చేసుకుం టోందని విమర్శించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులన్నీ మోదీ కట్టించారా.. అని ప్రశ్నించారు. బ్రహ్మపుత్ర నదిపై బ్రిడ్జికి రిబ్బ న్‌ కత్తిరించి, తామే కట్టి నట్లు మోదీ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.

 రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ బలహీనపడు తోందని ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజు అభిప్రాయ పడ్డారు. రాష్ట్రంలో 31 స్థానాల్లో పోటీచేస్తే 6 స్థానాల్లోనే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారని, వారిలో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారన్నారు. బూత్‌ స్థాయి నుంచి గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి నాయకులకు పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహాలను టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ వివరించారు.

మరిన్ని వార్తలు