కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం: కేఎల్‌ఆర్‌ 

16 Nov, 2018 19:39 IST|Sakshi
 మాట్లాడుతున్న కేఎల్‌ఆర్‌  

సాక్షి, కీసర: రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని మేడ్చల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఎల్‌ఆర్‌ అన్నారు. అధిష్టానం కేఎల్‌ఆర్‌ను మేడ్చల్‌ అభ్యర్థిగా   ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆయన కీసరలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్‌ పార్టీకి ఈసారి ప్రజలు పట్టకట్టనున్నారన్నారు. సోనియాగాంధీ , రాహుల్‌గాంధీ అంకితభావంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌ అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేశారన్నారు.

ఇక మేడ్చల్‌ విషయానికి వస్తే తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను అమలు చేశానని, తన హాయంలో జరిగిన అభివృద్ధి పనులు తప్ప టీఆర్‌ఎస్‌ నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్క చెప్పుకోదగ్గ అభివృద్ధి ఇక్కడ జరుగలేదన్నారు. తాను రెండు కళాశాలను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా విద్యనందిస్తుంటే ఎంపీ మల్లారెడ్డి విద్యావ్యాపారం చేస్తున్నాడన్నారు. మేడ్చల్‌ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజవకవర్గ ఓటర్లను అభ్యర్థించారు. అంతకు ముందు ఆయన కుటుంబ సమేతంగా కీసరగుట్టస్వామిని దర్శించుకున్నారు పార్టీ మండల అధ్యక్షుడు మొర్గుముత్యాలు, నేతలు ఖాజామోహినుద్దీన్, జైహింద్‌రెడ్డి,  రమేష్‌గుప్తా, జంగయ్యయాదవ్, తటాకం నారాయణశర్మ, తటాకం అభిలాష్, శ్రీకాంత్‌రెడ్డి, గూడూరు ఆంజనేయులుగౌడ్, దయానంద్‌గౌడ్, జానకీరామ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు