విద్యార్థులకు ఆర్టీసీ వరాలు

6 Jul, 2014 02:19 IST|Sakshi
విద్యార్థులకు ఆర్టీసీ వరాలు

రాయితీతో బస్‌పాస్‌లు జారీ చేస్తున్న అధికారులు
నిజామాబాద్ నాగారం: పాఠశాలలు, కళాశాలలు పున:ప్రారంభమయ్యాయి.. విద్యార్థులంతా బడిబట పట్టారు.. తమ గ్రామం నుంచి ఇతర ప్రాంతానికి వెళ్లి చదువుకునే వి ద్యార్థులకు ప్రయాణం భారంగా మారకుండా వారికి అవసరమైన బస్సుపాస్‌లు జారీ చేసేందుకు ఆర్టీసీ రం గం సిద్ధం చేసింది. జిల్లాలోని అన్ని ప్రధాన బస్టాండ్‌లో బస్సు పాస్‌లు ఇస్తున్నారు. నిజామాబాద్-1, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, డిపోలతోపాటు, ప్రధాన బస్టాండ్‌లో సైతం ఈ బస్సు పాస్‌లు జారీ చేస్తున్నారు.
 
రూ.20తో బస్‌పాస్‌లు..
12 ఏళ్లలోపు లేదా 7వ తరగతి వరకు చదివే విద్యార్థులు(బాలురు) వారి గ్రామం నుంచి పాఠశాల వరకు 20కిలో మీటర్లలోపు ఉంటే బస్ పాస్‌లు జారీ చేస్తారు. 12 జూన్ నుంచి ఏప్రిల్ 24, 2015 వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. దీనికోసం విద్యార్థులు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. 18 ఏళ్లలోపు లేదా పదో తరగతి చదివే విద్యార్థినులకు(బాలికలు) వారి గ్రామం నుంచి పాఠశాల వరకు 20కిలోమీటర్లలోపు బస్ పాస్‌లు జారీ చేస్తారు. 12 జూన్ 2014 నుంచి ఏప్రిల్ 24 2015 వరకు ఈ పాస్ చెల్లుబాటు అవుతుంది. ఈ ఉచిత బస్‌పాస్‌లు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మా త్రమే జారీ చేస్తారు.
 
కావాల్సిన పత్రాలు..
విద్యార్థులు ప్రభుత్వపరంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించిన ధ్రవీకరణ పత్రాలను సంబంధిత ప్రధానోపాధ్యయుడు, ప్రిన్సిపల్‌తో ధ్రువీకరించి దరఖాస్తులు సమర్పించాలి.
* విద్యార్థి ప్రవేశ నంబరు, పేరు, బ్రాంచ్, చదువుతున్న తరగతి వంటి వివరాలు పొందుపర్చాలి.
* రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఎవరికి అవసరమైతే వారే స్వయంగా బస్‌పాస్ కేంద్రానికి రావాలి.
* జిల్లాలో ఏ డిపో పరిధిలోని విద్యార్థులకు ఆ డిపో పరిధిలోనే పాస్‌లు జారీ చేస్తారు. కళాశాలలకు నేరు గా వచ్చి ఆర్టీసీ అధికారులే బస్సుపాస్‌లు అందిస్తున్నారు.
* ఆదివారం, సెలవురోజుల్లో బస్‌పాస్‌లు జారీ చేయరు.
 
రాయితీ బస్‌పాస్‌ల ధరలు..
ఈ పాస్ పొందాలంటే 35 కిలోమీటర్లలోపు విద్యా సంస్థ ఉండాలి. ఇందుకోసం ధ్రువీకరణ పత్రాలతోపాటు, బస్‌పాస్ ఫారం కోసం రూ.15 చెల్లించాలి. వీటిని ప్రతినెల పునరుద్ధరణ చేయించుకోవాలి. అలాగే దీంతోపాటు 3 నెలల రాయితీ పాస్‌లు ఒకేసారి తీసుకుని 3 నెలలు రాయితీపై ప్రయాణించవచ్చు. వాటి వివరాలు...

మరిన్ని వార్తలు