ఐఎన్‌ఎస్‌ డేగాను సందర్శించిన రాజస్థాన్‌ విద్యార్థులు

9 Nov, 2023 03:52 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాజస్థాన్‌కు చెందిన డైసీ డేస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు బుధవారం ఐఎన్‌ఎస్‌ డేగాను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఇండియన్‌ నేవీ ఎయిర్‌ స్క్వాడ్రన్‌ ఫాంటమ్స్‌ బృందం ముఖాముఖి నిర్వహించింది. నౌకాదళంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు భారత సాయుధ దళాల్లో చేరేలా చిన్నప్పటి నుంచే వారిని ప్రేరేపించేందుకు ఏటా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు చెప్పారు.   

మరిన్ని వార్తలు