ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు కృషి

10 Apr, 2018 13:27 IST|Sakshi
హుజూర్‌నగర్‌లో డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రులు

కార్పొరేట్‌కు దీటుగా మెరుగైన వైద్యసేవలు

ఏడాది కాలంలో మెడికల్‌ కళాశాల పనులు పూర్తిచేస్తాం

పలుచోట్ల మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు స్థలాల పరిశీలన

ఫ్లోరిన్‌ పీడను పారదోలేందుకే.. ‘మిషన్‌ భగీరథ’

‘పేట’,హుజూర్‌నగర్‌లో డయాలసిస్‌ సెంటర్లను ప్రారంభించిన మంత్రులు లక్ష్మారెడ్డి, గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట / హుజూర్‌నగర్‌ :రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ లక్ష్మారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి గుండకండ్ల జగదీశ్‌రెడ్డిలు పేర్కొన్నారు.  సూర్యాపేట, హుజూర్‌నగర్‌ ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్లను మంత్రులు సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ప్రజల ఆరోగ్యాలకు భరోసానిచ్చేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. అందులో భాగంగానే డయాలసిస్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు చేయనున్నామన్నారు. శిబిరాల ద్వారా ప్రజలందరికీ పరీక్షలు చేసి అద్దాలు, మందులు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు కూడా చేస్తామన్నారు. కార్పొరేట్‌కు దీటుగా వైద్యసేవలు అం దించేందుకు ప్రభుత్వం పాటుపడుతోందని తెలి పా రు.

సీఎం హామీ మేరకు నల్లగొండ, సూర్యాపేటలో మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్నా రు. నల్లగొండలో భవనాలు సిద్ధంగా ఉన్నాయని.. సూ ర్యాపేట జిల్లా కేంద్రంలో స్థలాన్ని పరిశీలించామని.. త్వరలో కళాశాలలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా అంటేనే ఫ్లోరో సిస్‌ గుర్తుకు వస్తుందన్నారు. ఇలాంటి జిల్లాల ప్రజలకు మేలు చేసేందుకే సీఎం మిషన్‌ భగీరథ నీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, కలెక్టర్‌ సురేంద్రమోహన్, కార్పొరేషన్‌ చైర్మన్‌ పర్యాద కృష్ణమూర్తి, డీఎంహెచ్‌ఓ మురళీమోహన్, డీసీహెచ్‌ఎస్‌ సంపత్‌కుమార్, సూర్యా పేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గండూరి ప్రవళిక,  బైరు దుర్గయ్యగౌడ్, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వైవి, కట్కూరి గన్నారెడ్డి, గండూరి ప్రకాష్, శనగాని రాంబాబుగౌడ్, మారిపెద్ది శ్రీని వాస్‌ గౌడ్, ఉప్పల ఆనంద్, కక్కిరేణి నాగయ్యగౌడ్, పుట్ట కిషోర్‌నాయుడు, నాతి సవిందర్‌కుమార్, హుజూర్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ దొంతగాని శ్రీని వాస్‌ గౌడ్,  వైస్‌ చైర్మన్‌ దొంతిరెడ్డి సంజీవరెడ్డి, ఎంపీపీ జి. నిర్మల, జడ్పీటీసీ ఎండీ.హఫీజా, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కె.శంకరమ్మ, రాష్ట్ర ఐడీసీ మాజీ డైరెక్టర్‌ సాముల శివారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అల్లం ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీఓ భిక్షానాయక్, వైద్యశాల సూపరింటెండెంట్‌ డా.ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు .

మరిన్ని వార్తలు