డ్రైవర్లు కారు.. ఇక ఓనర్లు!

26 Dec, 2014 18:11 IST|Sakshi

కారు డ్రైవర్లను యజమానులుగా మార్చే పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. మొత్తం 303 మంది లబ్ధిదారులకు కార్లను ఆయన అందజేశారు. త్వరలోనే మరో 600 మందికి వాహనాలు అందిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పారు. తమ కాళ్లమీద తాము నిలబడేలా చేసేందుకు, తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ఇలాంటి పథకాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని కేసీఆర్ చెప్పారు. 2015లో ప్రపంచ ఐటీ సదస్సు హైదరాబాద్ నగరంలోనే జరుగుతుందని ఆయన అన్నారు. నైపుణ్యాల అభివృద్ధితోనే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.

మరిన్ని వార్తలు