ఆర్థిక విధానాలే గుత్తాధిపత్యానికి కారణం

25 Feb, 2018 01:57 IST|Sakshi
కార్యక్రమంలో మాట్లాడుతున్న జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి  

హైదరాబాద్‌: నూతన ఆర్థిక విధానాలు గుత్తాధిపత్యానికి, ఆర్థిక అసమానతలకు కారణమయ్యాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన జనవిజ్ఞాన వేదిక తెలంగాణ 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. గుత్తాధిపత్య సంస్థల ఆకాంక్షలు ఎక్కడ మొదలై ఎక్కడ ఆగుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొం దని, నేడు అత్యంత ఉన్నతమైన పరిజ్ఞానాన్ని గూగుల్, ఫేస్‌బుక్‌ లాంటి సంస్థలు తీసుకొస్తున్నాయన్నారు. వారు సృష్టించిన సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నపైన, జిజ్ఞాసపై దాడి జరుగుతోందన్నారు.

ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ, రాజ్యాంగంలోని 39వ ఆర్టికల్‌ ఉత్పత్తి శక్తులు ఎవరి చేతుల్లో కేంద్రీకరించరాదని చెబుతోందని, దీనికి భిన్నంగా నేటి పరిణామాలు కనిపిస్తున్నాయన్నారు. జాతీయ ఆదాయంలో 73% ఆదా యం ఒక్క శాతం జనాభా వద్దనే ఉందని, దీని వల్ల ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నా రు. వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ న్యూట్రిషన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ మెహ్‌తాబ్‌ ఎస్‌.బాంజీ, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్‌ పి.అంబేడ్కర్, డాక్టర్‌ భీమేశ్వర్‌రెడ్డి, డాక్టర్‌ టి.సుందరరామన్, ప్రొఫెసర్‌ శీలాప్రసాద్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు