ఎన్నికల ప్రచారంలో టిఫిన్‌ రెడీ!

25 Nov, 2018 13:30 IST|Sakshi
బీజేపీ అభ్యర్థి రజినీరెడ్డి

సాక్షి, జోగులాంబ గద్వాల: అయిజ మండల పరిధిలోని సింధనూరు గ్రామంలో నివారం అలపూర్‌ బీజేపీ అభ్యర్థి రజినీరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో ఓ హోటల్‌ వద్దకు వెళ్లారు. అప్పటికే కార్యకర్తలకు ఆకలి వేస్తుండడంతో రజినీరెడ్డి స్వయంగా పెద్ద పాత్రలో అల్పాహారం (ఉగ్గాని) తయారుచేసి కార్యర్తలకు వడ్డించారు. ఆ చేతులతో టీ తయారుచేసి గ్లాసుల్లో పోసి కార్యకర్తలకు అందించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు