ఎగ్జిట్‌పోల్స్‌పై ఈసీ ఆంక్షలు

10 Nov, 2018 20:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల జరుగునున్న దృష్ట్యా ఎగ్జిట్‌ పోల్స్‌పై ఎన్నికల కమిషన్‌ ఆంక్షలు విధించింది. నవంబర్‌ 12 ఉదయం ఏడు గంటల నుంచి డిసెంబర్‌ 7వ తేది సాయంత్రం 5.30 వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించకుండా, ఫలితాలను ప్రచురించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 126ఏ ప్రకారం శనివారం ఈసీ నోటీసును జారీ చేసింది. ఎగ్జిట్‌ పోల్స్‌, ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాల ప్రభావం ఓటర్లపై పడే అవకాశం ఉందని వాటిని నిరోధించడానికి ఈ చర్య తీసుకున్నామని ఈసీ అధికారులు తెలిపారు.

నామినేషన్లు దాఖలు చేయడానికి నిర్ధేశించిన తొలిగంట నుంచి పోలింగ్‌ ముగిసే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అలాగే పత్రికలు, ఎలక్ట్రానిక్‌ ప్రాచార సాధనాల్లో వాటి ఫలితాలు ప్రచురణ, సమాచార పంపిణీపై కూడా ఈ ఆంక్షలు ఉంటాయని ఈసీ ప్రకటించింది.

మరిన్ని వార్తలు