నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

12 Jun, 2014 02:52 IST|Sakshi
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

 తిరుమలగిరి :నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని తుంగతుర్తి ఏడీఏ పి.వాసు హెచ్చరించారు. తిరుమలగిరిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి డివిజన్‌లో 10 వేల హెక్టార్లలో పత్తి గింజలు వేయడానికి 50 వేల ప్యాకెట్లు అవసరం కాగా ఇప్పటికే 30 వేల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. రైతులు పత్తి విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పని సరిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. రైతులు మొదటి వర్షానికే విత్తనాలు నాట వద్దని, భూమిలోని వేడిమికి గింజలు మొలకెత్తవని, తదుపరి కురిసే వర్షాలకు విత్తనాలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, ఏఈఓ మురళీ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు