పరిహారం ఇచ్చి కదలండి..

13 Jul, 2019 12:33 IST|Sakshi
వల్లూరు వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

సాక్షి, జడ్చర్ల(మహబూబ్‌నగర్‌) : తమకు పరిహారం ఇచ్చిన అనంతరం ప్రాజెక్టు పనులు సాగించాలని ఉదండాపూర్, వల్లూరు రైతులు ఆందోళన చేపట్టారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి మండలంలోని ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులను శుక్రవారం నిర్వాసితులు అడ్డుకున్నా రు. ప్రాజెక్ట్‌ పనులకు మట్టిని, కంకరను తీసుకెళ్తున్న టిప్పర్‌లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.  సేకరించిన భూములకు పరిహారం ఇప్పటి వరకు అందలేదని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ నిర్వాసితులకు ఇచ్చిన విధంగా తమకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముంపుకు గురవుతున్న వల్లూరు, ఉదండాపూర్‌ పునరావాసానికి సంబధించి శంకరాయపల్లి, కావేరమ్మపేట పరిధిలో ఇళ్ల స్థలాలను వెంటనే ఖరారు చేసి పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్‌ చేశారు. వల్లూరు ప్రధాన రహదారిపై గ్రామస్తులు, విద్యార్థులు లు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. 

 నిర్లక్ష్యం వీడని ప్రభుత్వం..  
రిజర్వాయర్‌ నిర్మాణానికి సానుకూలంగా స్పం దించి భూములు అప్పగించినా ప్రభుత్వం తమ ను చిన్న చూపు చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశా రు. బహిరంగ మార్కెట్‌లో ఎకరంగా కనీసంగా రూ.25 లక్షలు పలుకుతుందని, తమ భూములకు మాత్రం ప్రభుత్వం కేవలం రూ.5.50, రూ.6.50 లక్షలు మాత్రమే ఖరారు చేసిందని అన్నారు. తమ భూములకు ఆ విలువలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తేగాక తమకు రైతుబంధు పథకం సైతం నిలిపి వేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇక ఉదండాపూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామస్తులు సమావేశమై ఆందోళనకు సిద్దమయ్యారు. 

 రూ.32 కోట్లు విడుదల 
భూపరిహారం కోసం శుక్రవారం రూ.32 కోట్లు విడుదల చేసినట్లు  ఎమ్మెల్యే డాక్టర్‌సి లక్ష్మారెడ్డి తెలిపారు. సమస్యలను సీఎం కేసీఆర్‌ను కలిసి వివరించామని,సమస్యల పరిశ్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. వల్లూరు, ఉదండాపూర్‌లో అదికారులు పర్యటించి ఇండ్ల నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆయా విలువను అందజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వల్లూరు, ఉదండాపూర్‌ గ్రామాలకు సంబందించి ఖరారు చేసిన ఇళ్ల స్థలాలను కేటాయించి పునరావాసానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రక్రియను వేగవంతం చేసేందుకు గతంలో ఆర్డీఓగా పనిచేసి బదిలీపై వెళ్లిన లక్ష్మినారాయణను కూడా డిప్యుటేషన్‌పై తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలని అందరికీ న్యాయం జరిగే విదంగా తాము సముచితమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

అందరూ సహకరిస్తేనే అభివృద్ధివిశయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు సుదర్శన్‌గౌడ్, తదితరులు అక్కడికి చేరుకుని వారిని సముదాయించారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ఫోన్‌ చేసి విశయాన్ని వివరించారు. దీంతో ఆయన ఫోన్‌లో మైక్‌ ద్వారా గ్రామస్తులనుద్దేశించి మాట్లాడారు. రిజర్వాయర్‌నిర్మాణానికి అందరు సహకరించాలని,సమస్యల పరిశ్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వెంటనేపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా రిజర్వాయర్‌పనులకు తరలిస్తున్న కంకరను వల్లూరు సమీపంలో డంప్‌ చేయించారు. కంకరను విక్రయించి ఆసొమ్ముద్వారా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈసందర్భంగా పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు