హరితహారం మొక్కా.. మజాకా!

7 Sep, 2019 12:20 IST|Sakshi
గోపాల్‌రావుకు జరిమానా విధించిన ప్రతులను అందజేస్తున్న మున్సిపల్‌ కమిషనర్‌   

సాక్షి, మహబూబ్‌నగర్‌: హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కను తొలగించినందుకు పట్టణంలోని కల్పన టెక్స్‌టైల్స్‌ యజమాని గోపాల్‌రావుకు మున్సిపల్‌ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. ఇటీవలే అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతీ దుకాణం ఎదుట మొక్కలను నాటారు. అయితే గోపాల్‌రావు బట్టల దుకాణం ఎదుట నాటిన మొక్కను ఆయన తొలగించారు. చెట్టు తొలగించే దృశ్యాలను స్థానికులు వీడియో చిత్రీకరించి మున్సిపల్‌ అధికారులకు పంపించారు. దీంతో వారు వాల్టాచట్టం ప్రకారం సెక్షన్‌ 35, రూల్‌ నెం.26 నిబంధనల మేరకు రూ.10వేల జరిమానా విధించడంతో పాటు, తొలగించిన మొక్క స్థానంలోనే కొత్త మొక్కను నాటించారు. దాన్ని సంరక్షణ బాధ్యత బట్టల దుకాణం యజమానిదేనని కమిషనర్‌ వెంకటయ్య సూచించారు. పట్టణంలో కొందరు మేకలను రోడ్లపైకి వదులుతున్నారని, అవి చెట్ల ఆకులను తినడంతో పాటు, చెట్లను విరిచేస్తున్నాయని, హరితహారం మొక్కలు తింటే యజమానులకు కూడా జరిమానాలు విధిస్తామని తెలిపారు. 

మక్తల్‌లో మేక కట్టివేత 
మక్తల్‌: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నాటిన మొక్కలను ఓ మేక గురువారం మేయగా గమనించిన సిబ్బంది దాన్ని కార్యాలయంలో కట్టేశారు. అంతటితో ఆగకుండా మేక ఎవరిదో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఆ యజమానికి రూ.2వేల జరిమానా వేశారు. 


ఎంపీడీఓ కార్యాలయంలో మేక    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక మొహర్‌ రూ.50 వేలు..

యాదాద్రిలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ పర్యటన

‘ప్రణాళికా’యుతంగా అభివృద్ధి

రైతుబంధు డబ్బు కాజేసేందుకు అడ్డదారులు

సిటీ సైక్లిస్ట్స్‌ @ ప్యారిస్‌

కలెక్టర్‌తో సహా అధికారులకు కోర్టు నోటీసు 

బతుకమ్మ చీరలొచ్చాయ్‌ !

తగ్గిన సీసీఐ.. తలొగ్గిన మిల్లర్లు!

నేడు ‘మీట్‌ యువర్‌ ఎండీ’

‘ప్రాణహిత’పై ఆశలు

ఎల్"బీపీ".. నగర్

మామకు మన సామాను

ఎమ్మెల్యే రేగాకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు!

అవినీతిలో 'సహకారం'!

మండపాల్లో కేసీఆర్‌ బొమ్మ చెక్కడంపై నిరసన

టీఆర్‌ఎస్‌లో కలకలం!

ఆ డైలాగ్‌కు అర్థం ఇదా..: విజయశాంతి 

మార్క్‌ఫెడ్‌ అప్పు.. రూ. 1,827 కోట్లు

పిల్లలపైనే డెంగీ పడగ!

బల్దియా.. జల్దీయా?

ఊరికి యూరియా

పోలీసులపైనా ఫిర్యాదు చేయొచ్చు! 

పట్టాలెక్కిన పల్లె ప్రణాళిక 

నిమ్స్‌లో ఇకపై మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ సేవలు 

12న గణేష్‌ శోభాయాత్ర

భద్రం కాదు.. ఛిద్రం

స్తంభాలపై కేసీఆర్‌ చిహ్నాలా?: లక్ష్మణ్‌

కేసీఆర్‌ బొమ్మ.. దుర్మార్గం: రేవంత్‌ 

సమకాలీనతకు అద్దంపట్టే చిత్రాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది ఎవరి క్యారెక్టరో చెప్పగలరా?

రిలీజ్‌ చేయలేకపోయాం.. కానీ!

టాప్‌ స్టార్‌కు నో చెప్పింది!

మరో స్పోర్ట్స్‌ డ్రామాలో తాప్సీ

ముఖ్యమంత్రికి నటి సూటి ప్రశ్న

అల... ఓ సర్‌ప్రైజ్‌