హాస్టల్‌లో ఫుడ్‌ పాయిజన్‌ 

7 Jan, 2019 01:42 IST|Sakshi
నల్లకుంట ఫీవర్‌ ఆస్ప్రత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులు

చేవెళ్ల కస్తూర్బాలో 67 మంది విద్యార్థినుల అస్వస్థత  

భూపాలపల్లి జిల్లాలోనూ 22 మందికి ఫుడ్‌ పాయిజన్‌ 

హైదరాబాద్‌/చేవెళ్ల: వికారాబాద్‌ జిల్లా చేవెళ్లకు చెందిన కస్తూర్బా రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాల విద్యార్థినులు కడుపు నొప్పి, విరేచనాలు, వాంతులతో బాధపడుతుండగా పాఠశాల సిబ్బంది నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. చేవెళ్లలోని కçస్తూర్బాగాంధీ బాలికల రెసిడెన్సీ పాఠశాలలో మొత్తం 206 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. శనివారం రాత్రి భోజనంలో ఫ్రూట్స్‌ సలాడ్‌తో పాటు అన్నం, క్యాప్సికం కర్రీ, సాంబార్, మజ్జిగను ఇచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విద్యార్థినులకు కడుపులో నొప్పి రావడంతో పాటు వాంతులు, విరేచనాలు మొదలయ్యా యి.

వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం మొదలైంది. సుమారు 67 మంది విద్యార్థినులను పాఠశాల హాస్ట ల్‌ వార్డెన్, టీచర్లు, సిబ్బంది వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినులను పరీక్షించిన వైద్యులు హైదరాబాద్‌కు తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో కొందరిని నీలోఫర్‌ ఆస్పత్రికి, మరికొందరిని ఉస్మానియాకు తరలించారు. వీరిలో ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉన్న 12 మంది విద్యార్థినులను నల్లకుంటలోని ఫీవర్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో 8,9,10 వ తరగతి విద్యార్థినులే ఉన్నారు. వీరిని అక్కడి టీచర్‌ రేణుక, ఏఎన్‌ఎం మనోహర్‌ తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి ఫుడ్‌ పాయిజన్‌ అయిందని తెలిపారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ లలిత, చేవెళ్ల ఆర్డీవో హన్మంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులు ఆస్పత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. ఘట నపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.  

గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు అస్వస్థత 
చిట్యాల(భూపాలపల్లి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళా శాలలో కలుషిత ఆహారం తినడం వల్ల 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

మరిన్ని వార్తలు