సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

8 Sep, 2017 01:15 IST|Sakshi
సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

గౌరీ లంకేశ్‌ హత్యపై పాత్రికేయుల డిమాండ్‌
హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన


సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్‌ దారుణ హత్యపై కర్ణాటక ప్రభుత్వం సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. గురువారం హైద రాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో గౌరీ లంకేశ్‌కు నివాళిగా భారీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిం చారు. ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేకచట్టం తేవాలన్నారు. గౌరీ లంకేశ్‌ హత్య పత్రిక, భావప్రకటనా∙స్వేచ్ఛపై దాడి అని, దేశంలో జర్నలిస్టులకే కాకుండా, సామాన్యుకూ రక్షణ లేదని అన్నారు. గోవింద్‌ పర్సారే, నరేంద్ర దబోల్కర్, కల్బుర్గీ.. ఇప్పుడు గౌరీ లంకేశ్‌ హత్యలకు ఒకటే కారణం కనిపి స్తోందన్నారు. హత్యకు కారకులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఐజేయూ నాయకుడు కె.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆశీసులతో వచ్చిన మత శక్తులే ఈ హత్యకు కారణమన్నారు.

ప్రశ్నించేవారికి రక్షణ కరువైంది...
‘సాక్షి’ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ గౌరీ లంకేశ్‌ని కాల్చినట్లే గురువారం బిహర్‌లో కూడా ఓ జర్నలిస్టుపై కాల్పులు జరి పారని అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడే వారి మీద దాడులు ఎక్కువ య్యాయని విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామి కవాదులు దీన్ని సవాలుగా తీసుకొని, ప్రతిఘ టించాలని సూచించారు. దేశంలో ప్రశ్నించే వారికి రక్షణ కరువైందన్నారు. మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ మాట్లాడుతూ గౌరీ లంకేశ్‌ విలువల కోసం పోరాడిన పాత్రికేయురాలని కొనియా డారు. ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హను మంతరావు, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ ఆర్‌ దిలీప్‌రెడ్డి, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షప్రధాన కార్యదర్శులు రాజమౌళిచారి, విజయ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు