‘ప్రతి ఒక్కరూ ఓటు వేసి నగర ఔనత్యాన్ని నిలబెట్టాలి’

25 Nov, 2018 09:03 IST|Sakshi

‘మై ఓట్, మై సిటీ, మై రన్’ పేరుతో నెక్లెస్‌ రోడ్‌లో 10కే రన్‌

పెద్దఎత్తున తరలివచ్చిన యువత, సినీ నటులు

ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి: జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌

సాక్షి, హైదరాబాద్‌ : నగర ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించిన 10కే రన్‌కు విశేష స్పందన లభించింది. ‘మై ఓట్‌, మై సిటీ, మై రన్‌’  అనే పేరుతో నిర్వహించిన ఈ రన్‌లో దాదాపు 5వేల మంది పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌, ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ, సినీ నటులు రాశీఖన్నా, తమన్నా,సందీప్‌ కిషన్‌, నవదీప్‌తో  పాటు పెద్ద ఎత్తున యువత ఈ రన్‌కు తరలివచ్చారు. దాన కిషోర్‌ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌ జిల్లా అక్షరాస్యత 90శాతం ఉన్నప్పటికీ ఓటింగ్‌లో మాత్రం గ్రామీణ ప్రాంతాల కన్నా అతి తక్కువగా కేవలం 53శాతం మాత్రమే నమోదు కావడం బాధాకరం అన్నారు. డిసెంబర్‌ 7న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేసి హైదరాబాద్‌ ఔనత్యాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ఈ రన్‌ సందర్భంగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లు, వీవీ ఫ్యాట్‌ మిషన్లను ఏర్పాటు చేసి మాక్‌ పోల్‌ నిర్వహించారు.

మరిన్ని వార్తలు