ఘనంగా ‘మహలనోబిస్‌’ జయంతి

30 Jun, 2018 12:09 IST|Sakshi
పి.సి. మహలనోబిస్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌ 

ఆసిఫాబాద్‌అర్బన్‌: ప్రముఖ గణాంక శాస్త్రవేత్త ప్రశాంత్‌ చంద్ర మహలనోబిస్‌ 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గణాంక దినోత్సవాన్ని శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పి.సి. మహలనోబిస్‌ చిత్రపటానికి కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌ మాట్లాడుతూ మహలనోబిస్‌ గణాంకాలు కేంద్ర, రాష్ట్ర ఆదాయ వ్యయాలను లెక్కించడానికి, జాతీయ ఆదాయం లెక్కించడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికా రచనకు ఎంతో తోడ్పడతాయన్నారు. జిల్లా అభివృద్ధి కోసం జిల్లా స్థాయి అధికారులంతా తమ తమ శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను ఖచ్చితమైన గణాంకాలతో సమర్పించాలన్నారు.

అనంతరం సీపీవో కృష్ణయ్య మాట్లాడుతూ దేశ ప్రణాళికల రూపకల్పనకు నెహ్రూ ఎంత ప్రాముఖ్యాన్నిచ్చారో ఈ గణాంక శాఖకు అంతటి పేరు రావడానికి, భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు పి.సి. మహలనోబిస్‌ కూడా అంతే ప్రాముఖ పాత్రను వహించారన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ గణాంక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు.

ఈ గణాంకాల దినోత్సవాన్ని 2007 నుంచి జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వాహణశాఖ వారి ‘ఆకాశంలో నల్లని మబ్బులు, మెరుపులను చూసారా, ఉరుములను విన్నారా, అయితే ‘పిడుగులు పడవచ్చు జాగ్రత్త’ అనే పోస్టర్లను విడుదల చేశారు.

మరిన్ని వార్తలు