ప్రమాద ఘంటికలు

2 May, 2020 13:37 IST|Sakshi
రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో అడుగంటిన బావి

పడిపోతున్న భూగర్భ జలాలు

76 గ్రామాల్లో బోర్లు వేయడం నిషేధం

నీటి వినియోగంపై ఆందోళన

సాక్షి, జనగామ:  అసలే కరువు నేల..వేసవి రానే వచ్చింది. భూగర్భ జలాలు క్రమక్రమంగా అడుగంటిపోతున్నాయి. నీటి వినియోగం..ఉష్ణోగ్రతలు పెరగడంతో భూగర్భ జలాలు ప్రమాద ఘంటికను మోగిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 76 గ్రామాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి.

బోర్లు వేయడానికి నో..
తక్కువ వర్షపాతానికి జిల్లా కేరాఫ్‌గా మారింది. సముద్ర మట్టానికి 510 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి, కృష్ణా నదులకు మధ్యలో ఉండడంతో సహజంగానే తక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. కురిసే వర్షం కంటే నీటి వినియోగం మాత్రం ఎక్కువగా ఉంటుంది. సాగు, తాగు నీటి అవసరాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. నీటి వినియోగం ఎక్కువగా ఉన్న 76 గ్రామాలను భూగర్భ జలశాఖ(గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌) అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాల్లో  బోర్లు వేయడం, నీటిని బయటకు తోడడం వంటి కార్యక్రమాలపై నిషేధం విధించారు. సాగు నీటి అవసరాలను తగ్గించుకొని కేవలం ఇంటి పనులను తీర్చుకోవడానికే నీటిని వినియోగించాలని సూచనలు చేస్తున్నారు. నీటిని పొదుపుగా వాడుకోవడంపై చర్యలు చేపట్టారు.

పడిపోతున్న భూగర్భ జలాలు..
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. దేవాదుల ద్వారా నీటిని తరలించి చెరువులను నింపడంతో జిల్లాలో సగటున 8 మీటర్ల నుంచి 10 మీటర్ల వరకు భూగర్భ జలాలున్నాయి. ప్రస్తుతానికి 14 మీటర్ల లోతుకు జిల్లా భూగర్భ జలాలు పడిపోయాయి. 76 గ్రామాల్లో 20 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.

బోర్లు వేయడం నిషేధం ఉన్న గ్రామాలు ఇవే..
బచ్చన్నపేట మండలం: అలీంపూర్, బండ నాగారం, చిన్న రామన్‌చర్ల, దుబ్బకుంటపల్లి, ఇటుకాలపల్లి, కాసిరెడ్డిపల్లి, కొడవటూరు, లక్ష్మాపూర్, మన్‌సాన్‌పల్లి, నారాయణపూర్, పడమటి కేశవాపూర్, పుల్లగూడ(డీ), రామచంద్రాపూర్, తమ్మడపల్లి
దేవరుప్పుల మండలం: చిన్నమడూర్, ధర్మపురం, గొల్లపల్లి, మదాపూర్, మన్‌పహాడ్,

సింగరాజుపల్లి
జనగామ మండలం: అడవి కేశవాపూర్, చీటకోడూరు, చౌడారం, చౌడరపల్లి, గానుగుపహాడ్, గోపరాజుపల్లి, జనగామ పట్టణం, మరిగడి, ఓబుల్‌కేశవాపూర్, పసరమడ్ల, పెద్ద పహాడ్, పెద్ద రామన్‌చర్ల, పెంబర్తి, శామీర్‌పేట, సిద్దెంకి, వడ్లకొండ, గొర్రగొల్లపహాడ్‌

కొడకండ్ల మండలం: కొడకండ్ల, మొండ్రాయి. రేగుల

లింగాలఘనపురం మండలం: చీటూరు, చిన్నరాజిపేట, గుమ్మడవెల్లి, కళ్లెం, నాగారం, నేలపోగుల, నెల్లుట్ల, వడిచర్ల, వనపర్తి

నర్మెట మండలం: అమ్మాపురం, బొమ్మకూర్, హన్మంతాపూర్, మల్కాపేట్‌

పాలకుర్తి మండలం: కోతులబాధ, లక్ష్మీనారాయణపురం, మల్లంపల్లి, ఎల్లరాయి తొర్రూర్‌

రఘునాథపల్లి మండలం: బానాజీపేట, ఫతేషాపూర్, గోవర్ధనగిరి, కన్నాయిపల్లి, కోడూర్, మాదారం, రఘునాథపల్లి, వెల్ది

స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం: ఇప్పగూడెం, శివునిపల్లి

తరిగొప్పుల మండలం: అక్కరాజుపల్లి, అంకూషాపూర్, బొంతగట్టునాగారం

జఫర్‌గఢ్‌ మండలం: అలియాబాద్, సూరారం, తీగారం, తిమ్మంపేట, తిమ్మాపూర్‌

మరిన్ని వార్తలు