నెల రోజుల్లో కాళేశ్వరం నీళ్లు

5 Mar, 2020 03:14 IST|Sakshi
గజ్వేల్‌లో ప్రసంగిస్తున్న మంత్రి హరీశ్‌రావు

ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 

గజ్వేల్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు మరో నెల రోజుల్లోపు కొండపోచమ్మ సాగర్‌ జలాశయంలోకి రానున్నాయని, దీని ద్వారా ఎండా కాలంలోనూ చెరువులు, కుంటలు నింపుకునే అవకాశం ఉంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్‌ మండలాల్లో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ భూపతిరెడ్డిలతో కలసి పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభో త్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కరువును శాశ్వతంగా పారదోలేందుకు సీఎం కేసీఆర్‌ చిత్తశుద్ధితో చేస్తున్న పనులు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. కొండపోచమ్మ సాగర్‌కి నీళ్లు వస్తే సిద్దిపేటతో పాటు యాదాద్రి, మేడ్చల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.  

మరిన్ని వార్తలు