ఏపీ సర్కార్ది మొండి, తొండి వాదన: హరీశ్

3 Jan, 2015 13:01 IST|Sakshi

హైదరాబాద్ : కృష్ణాజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొండి, తొండి వాదన అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అవసరం మేరకు వాడుకుని ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఏపీ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సచివాలయంలో హరీశ్ రావు శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందన్నారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ టీడీపీ నేతల వైఖరి ఏంటో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. టీ.టీడీపీ నేతలు ఎంతకాలం చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంపు ద్వారా భద్రాద్రి రాముడిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు అన్నారు. రాజధాని శివార్లలో  భూ వివాదంలో తన బంధువులంటూ వస్తున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అనవసర ఆరోపణలు చేసే టీడీపీ నేతలు వాటిని రుజువు చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.

>
మరిన్ని వార్తలు