'హెల్త్‌కార్డులకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు'

7 Feb, 2016 20:24 IST|Sakshi

చిట్యాల: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రెస్ ఆకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా చిట్యాలలో విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్‌కార్డులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. అందులో భాగంగా మొదటి విడతలో హైదరాబాద్, వరంగల్, మెదక్ జిల్లాల్లో త్రిబుల్ బెడ్‌రూం కాలనీలు నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

హెల్త్ కార్డుల కోసం రెండు వేల మందికి మాత్రమే ఆమోదం లభించిందని, మిగిలిన 24 వేల మంది జర్నలిస్టులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే డీపీఆర్వోలను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర నాయకులు పల్లె రవికుమార్, క్రాంతి, యూసూఫ్‌బాబులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు