దంచేసి..ఆరేసి

12 Sep, 2018 09:09 IST|Sakshi

సిటీలో సాయంత్రం ఒక్కసారిగా కుంభవృష్టి

ఆసిఫ్‌నగర్‌లో అత్యధికంగా 6.8 సెం.మీ వర్షపాతం నమోదు  

పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నరకం

సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ద్రోణి ప్రభావంతో నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పలు చోట్ల కుంభవృష్టి కురిసింది. భారీ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్లలోతున వరదనీరు పోటెత్తడంతో ఎక్కడికక్కడ...    ట్రాఫిక్‌ స్తంభించింది. హైటెక్‌ సిటీ రూట్లో కొన్ని గంటలపాటు ట్రాఫిక్‌  జామ్‌ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రాగల 24 గంటల్లో నగరంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.

రాత్రి 8 గంటల వరకు పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి 
ప్రాంతం     నమోదైనవర్షపాతం(సెంటీమీటర్లలో)
ఆసిఫ్‌నగర్‌        6.8
సర్దార్‌మహల్‌     6.6
మాదాపూర్‌        6.4
చందూలాల్‌బారాదరి    5.8
మైత్రీవనం          5.3
శ్రీనగర్‌కాలనీ       4.3
బండ్లగూడా         4.2
గణాంకభవన్‌       3.2
నాంపల్లి              3.3
గోల్కొండ            2.8
కూకట్‌పల్లి          2.6
ముషీరాబాద్‌      2.3
మల్కాజ్‌గిరీ       2.2
మోండామార్కెట్‌  2.1
జూబ్లీహిల్స్‌        2.1
అంబర్‌పేట్‌         2.5
పాశమైలారం      2.3
ఎల్భీనగర్‌         1.9
ఆస్మాన్‌ఘడ్‌     1.8
విరాట్‌నగర్‌       1.7
బేగంపేట్‌           1.7
కుత్భుల్లాపూర్‌    1.6
షాపూర్‌నగర్‌      1.5
కుత్భుల్లాపూర్‌   1.4
రాజేంద్రనగర్‌       1.1

మరిన్ని వార్తలు