ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు

5 Nov, 2018 09:53 IST|Sakshi
తాడూరి బాలాగౌడ్‌ ,నేరేళ్ల ఆంజనేయులు 

నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): ఉమ్మడి నిజామా బాద్‌లో ఎల్లారెడ్డి అ సెంబ్లీ  నియోజకవర్గం నుంచి గెలు పొందిన ఎమ్మెల్యేల్లో చాలా మంది  ఉన్నత పదవులు నిర్వర్తించారు. 1962లో ఏర్పడిన ఎల్లారెడ్డి  నియోజకవర్గం మొదట కామారెడ్డితో కలిసి ఉమ్మడి నియోజకవర్గంగా  ఉండేది. అప్పుడు ఈ స్థానం ఎస్సీకి రిజర్వు చేయబడింది. 1962లో  మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం నుంచి  టి.ఎన్‌.సదాలక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎల్లారెడ్డి నుంచి  పోటీచేసి గెలుపొందిన టి.ఎన్‌.సదాలక్ష్మి అప్పటి ముఖ్యమంత్రి నీలం  సంజీవరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా కొనసాగారు. 

అనంతరం 1967, 1972లలో జరిగిన వరుస ఎన్నికల్లో ప్రస్తుత  మాజీమంత్రి గీతారెడ్డి తల్లి జెట్టి ఈశ్వరీబాయి ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం  నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1967 ఎన్నికల్లో రిపబ్లికన్‌  పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి బరిలోకి దిగిన ఈశ్వరీబాయి 1969లో  మొదలైన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ  ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ రోజుల్లోనే ఈశ్వరీబాయి  సంపూర్ణ తెలంగాణ ప్రజా సమితి(ఎస్‌టీఎస్‌) పార్టీని ఆమె స్థాపించారు.  1972లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌టీఎస్‌ తరపున ఈశ్వరీబాయి, కాంగ్రెస్‌  నుంచి నంది ఎల్లయ్య పోటీ చేశారు. ఈ ఎన్నికల్లోనూ ఈశ్వరీబాయి  రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనాటి రాష్ట్రశాసనసభ  ప్రతిపక్ష నాయకులలో ప్రముఖ నాయకులైన తరిమెల నాగిరెడ్డి,  వావిలాల గోపాలకృష్ణయ్య, జి.శివయ్యగార్ల వరుసలో ఈశ్వరీబాయి  కూర్చునేవారు.

1978లో ఎస్సీ రిజర్వ్‌డ్‌
1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానం ఎస్సీ రిజర్వేషన్‌ నుంచి  జనరల్‌కు మారడంతో నియోజకవర్గ పరిధిలోని లింగంపేట మండలం  అయిలాపూర్‌కు చెందిన తాడూరి బాలాగౌడ్‌ కాంగ్రెస్‌ తరపున  పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన అప్పటి  ముఖ్యమంత్రులు టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి  కేబినెట్‌లలో చక్కెర పరిశ్రమశాఖ మంత్రిగా, రోడ్లుృభవనాలశాఖ  మంత్రిగా కొనసాగారు. దీంతోపాటు నిజామాబాద్‌ జిల్లా పరిషత్‌  చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం బాలాగౌడ్‌ నిజామాబాద్‌ పార్లమెంట్‌స్థానం నుంచి రెండుసార్లు పోటీచేసి ఎంపీగా  గెలుపొందారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గౌడసంఘం  రాష్ట్ర అధ్యక్షుడిగా, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగా రు.

నేరెళ్ల హ్యాట్రిక్‌
1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన గాంధారి వాస్తవ్యులు  నేరేళ్ల ఆం జనేయులు తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  అనంతరం 1994, 1999ల లో వరుసగా జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ  తరపున పోటీచేసిన నేరేళ్ల ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎల్లారెడ్డి  నియోజకవర్గం నుంచి వరుసగా మూ డుసార్లు ఎమ్మెల్యేగా విజయం  సాధించి హ్యాట్రిక్‌ సాధించిన నేతగా పేరొందారు. వరుసగా  మూడుసార్లు శాసనసభకు ఎన్నికైన నేరేళ్ల ఆంజనేయులు 1998లో  ప్రభుత్వవిప్‌గా కొనసాగారు. 2001లో రాష్ట్ర సివిల్‌ సప్లయ్‌ చైర్మన్‌గా  పనిచేశారు. 2004లో సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఇ  లా ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు  ఉన్న త పదవులను అధిరోహించి జిల్లాలో ఎల్లారెడ్డి ప్రత్యేకతను  చాటారు.

మరిన్ని వార్తలు