ఇండికా కారులో బయటపడ్డ టేకు కర్రలు

10 May, 2015 11:54 IST|Sakshi

సుల్తానాబాద్ : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో జరిగిన ఓ చిన్న రోడ్డు ప్రమాదంతో కారులో అక్రమంగా తరలిస్తున్న టేకు కర్రలు బయటపడ్డాయి. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఆదివారం ఉదయం ఓ లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే లారీ వెళ్లిపోగా కారు అక్కడే నిలిచిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ కారు వద్దకు చేరుకుని తనిఖీ చేయగా అందులో రూ.40 వేలు నుంచి రూ.50 వేల విలువ చేసే టేకు కర్రలు తరలిస్తున్నట్టు వెలుగు చూసింది. దీంతో కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, ఆ కారును స్టేషన్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు