అస్థికలతో ఆభరణాలు

1 Apr, 2017 04:48 IST|Sakshi
అస్థికలతో ఆభరణాలు

నంగునూరు: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో పురావస్తుశాఖ అధికారులు కొనసాగిస్తున్న తవ్వకాల్లో శుక్రవారం అస్థికలతో చేసిన ఆభరణాలు లభ్యమయ్యాయి. మెన్‌హిర్‌ వద్ద ఉన్న మొదటి సమాధిలో 50 సెంటీమీటర్ల ఎముకతోపాటు, చిన్న ముక్కలు, ఎర్రమట్టి పాత్ర, మూడు నల్లటిమట్టి గిన్నెలు లభిం చాయి. ఈ సందర్భంగా పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాగరాజు, ఎర్రమరాజు భానుమూర్తి మాట్లాడుతూ నర్మెటలోని పెద్ద సమాధిలో రెండున్నర మీటర్ల లోతు తవ్వకాలు జరిపి కీలకమైన ప్రాచీన మానవుడి ఆనవాళ్లను గుర్తించామని చెప్పారు.

పొడవాటి కాలి ఎముకతోపాటు, ఎముకలతో చేసిన ఆభరణాలను వెలికి తీశామన్నారు. ఆనాటి మహిళలు దీన్ని ఆభరణంగా ధరించి ఉండవచ్చని భావిస్తున్నామని, పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. మరికొన్ని మృణ్మయ పాత్రలు లభించాయన్నారు. ఇప్పటికే చాలా సమాచారాన్ని సేకరించామని, ఐదు రోజుల్లో తవ్వకాలు పూర్తి చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు