లక్షన్నర మంది తెలంగాణవాసులకు ఊరట

23 Nov, 2014 02:18 IST|Sakshi
  • ఒబామా నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు
  • రాయికల్: అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న తెలంగాణవాసులకు ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటనతో ఊరట లభించింది. రాష్ట్రంలోని కరీం నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 3 లక్షల మంది అమెరికా సంయుక్త రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూజెర్సీ, న్యూయార్క్, సౌత్ కాలిఫోర్నియా, టెక్సా స్, వాషింగ్టన్ వంటి ప్రధాన రాష్ట్రాల్లో ఉపాధి పొందుతున్నారు.

    ఇందులో సుమారు లక్ష మంది సందర్శక వీసాలపై వెళ్లి వీసా గడువు ముగియడంతో అక్కడే స్థిరపడి దొంగచాటుగా పనులు చేసుకుంటున్నట్టు సమాచారం. స్టూడెం ట్ వీసాపై వెళ్ల్లి చదువుకుంటున్న విద్యార్థులు చాటుగా హోటళ్లు, కంపెనీల్లో పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

    ఇలా ఉంటున్న వారిని పంపించేందుకు అమెరికా పార్లమెంట్ నిర్ణయించుకోగా అధ్యక్షుడు ఒబామా మాత్రం దేశంలో ఉండేందుకు తాత్కాలికంగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించడంతో వీరందరికి ఊరట లభించినట్టయింది. అక్కడ అక్రమం గా ఉంటున్న సుమారు లక్ష మంది తెలంగాణవాసులతో పాటు మరో యాభై వేల మంది విద్యార్థులకు ఇది ఎంతో దోహదపడి గ్రీన్ కార్డు (లీగల్ పర్మనెంట్ స్టేటస్) వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు