21 ఏళ్ల తర్వాత పరిహారం!

9 Aug, 2015 09:12 IST|Sakshi

రైల్వే శాఖ నుంచి అందిన డబ్బులు
వికారాబాద్: ఓ రైతు న్యాయపోరాటం ఫలించింది. 21 ఏళ్ల తర్వాత రైల్వే శాఖ నుంచి పరిహారం అందింది. వివరాలు.. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం కాలనీకి చెందిన రైతు ప్రకాష్‌కు చెందిన 11 గుంటల భూమిని డబుల్ ట్రాక్ కోసం 1994లో రైల్వే శాఖ తీసుకుంది. అప్పట్లో రెవెన్యూ అధికారులు భూమికి తక్కువ పరిహారం నిర్ణయించారు. ఆశించిన ధర రాకపోవడంతో రైల్వే శాఖకు వ్యతిరేకంగా రైతు హైకోర్టును ఆశ్రయించాడు.

రైతు ప్రకాష్‌కు కేవలం 11 గుంటల భూమి మాత్రమే ఉండి వేరే ఆధారం లేకపోవడంతో ఆయన స్థితిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం రూ. 8,09,377 పరిహారం చెల్లించేలా రైల్వేశాఖను ఆదేశించింది. సదరు చెక్కును వికారాబాద్ సీనియర్ సివిల్ జడ్జి, లోక్ అదాలత్ చైర్మన్ గోవిందారెడ్డి శనివారం రైతుకు అందచేశారు. చాలా ఏళ్ల తర్వాత తనకు సరైన న్యాయం జరగడంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.

>
మరిన్ని వార్తలు