నేరగాళ్లపై నజర్‌

14 Nov, 2018 15:13 IST|Sakshi

తహసీల్దార్‌ ఎదుట బైండోవర్లు 

వారం, వారం స్టేషన్లలో హాజరు

బిజీబిజీగా పోలీస్‌ అధికారులు

సాక్షి,నిజాంసాగర్‌(జుక్కల్‌): ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో పాత నేరస్థులు, నాటుసారా విక్రయదారులు, బెల్టుదుకాణాల విక్రయదారులు, రౌడీషీటర్లు, సమస్యాత్మక  వ్యక్తుల కదలికలపైన పోలీసులు దృష్టి సారించారు. సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రి య మొదలవడం, ఎన్నికల ప్రచారం వేడెక్కడటంతో గ్రామా లు, పట్టణాల్లో అవాంచనీయసంఘటనలు జరగకుండా పోలీసు బాసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

 ముందస్తు జాగ్రత్తలు..

ముందస్తు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపేలా పోలీస్‌ ఉన్నతాధికారులు ముందుస్తు జాగత్త్రలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల, సర్కిల్, డివిజన్, జిల్లా కార్యాలయాల వారిగా ఉన్న పాత నేరస్థులకు సమాచారం అందిస్తున్నారు. పాత నేరస్థులు, నాటుసారా విక్రయదారులు, బెల్టు దుకాణాదారులు,  రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తులను పోలీస్టేషన్లకు పిలిపిస్తున్నారు. ఆయా పోలీస్‌స్టేషన్లల్లోని రిజిష్టర్లు నేరస్థుల హాజరు నమోదు చేసుకుంటూ మండల కేంద్రాల్లోని తహసీల్‌ కార్యాలయాల్లో తహసీల్దార్‌ ఎదుట బైండోవర్లు చేస్తున్నారు. జిల్లాలోని 22 మండలాల పోలీస్‌స్టేషన్లల్లో పరిధిలో ఉన్న పాత నేరస్థులకు సమాచారం అందించడంతో పాటు ప్రతీ రోజు 10 నుంచి 20 మందిని తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేస్తున్నారు.

హత్యలు, హ త్యాయత్నాలు, నేతలపై దాడులు, రాజకీయ కక్షసాధింపు, ఎన్నికల ప్రచారంలో అల్లర్లు, మద్యం సేవించి గోడవలు సృష్టించే వారిని పోలీసులు బైం డోవర్‌ చేస్తున్నారు. దాంతో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్లు, తహశీల్దార్‌ కార్యాల యాల్లో నేరస్థుల బైం డోవర్లు జోరుగా సాగుతున్నాయి. పాత నేరస్థులకు పోలీసులు కౌన్సిలింగ్‌ ఇస్తూన్నారు. అంతేకాకుండా ప్రతీ వారం, వారం పోలీస్‌స్లేషన్లకు వచ్చే రిజిష్టర్లల్లో హాజరు అయ్యేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 552మంది నేరస్థులను పోలీసులు తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. అన్ని పోలీసుస్టేషన్ల వారిగా నేరస్థుల బైండోవర్‌ సమాచారాన్ని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. 

నాటుసారా, బెల్టుషాప్‌లకు చెక్‌... 

జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఉన్న పాతనేరస్థులతో పాటు నాటుసారా విక్రయదారులు, బెల్టుషాపు నిర్వహకులను పోలీసులు బైండోవర్‌ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున్న గ్రామాల్లో నాటుసారా తయారు, బెల్టు సీసాల విక్రయాలు చేపట్టకుండా పోలీసులు వారిని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాలను మద్యం తీసుకొచ్చే వారితో వారిని ప్రోత్సహిస్తున్న వారిని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాజకీయ పార్టీల్లో ఉన్న సమస్యాత్మక వ్యక్తులు, కార్యకర్తలు, నాయకులను కూడా పోలీసులు బైండోవర్‌ చేస్తు న్నారు.

మరిన్ని వార్తలు