ఎంపీ కవితపై మధుయాష్కీ తీవ్ర విమర్శలు

27 Jan, 2017 19:31 IST|Sakshi
ఎంపీ కవితపై మధుయాష్కీ తీవ్ర విమర్శలు

హైదరాబాద్‌: తెలంగాణలో రావుల పాలనలో ప్రజలకు ఏమీ రావని నిజామాబాద్‌ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ ఎంపీ కవితపై కాంగ్రెస్ నేత మధుయాష్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బంగారు వడ్డాణం ఇస్తానంటేనే కార్యక్రమాలకు వెళ్లే ఎంపీ కవితకు కాంగ్రెస్‌పై విమర్శలు చేసే స్థాయి ఉందా? అని ప్రశ్నించారు. కలెక్టర్‌లతో సేవలు చేయించుకుంటూ తాను దొరసానినని చాటుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీకి ఏ టీం, బి టీంలుగా వ్యవహరిస్తున్నారని, త్వరలోనే తెలంగాణలో చిన్న మోదీ కేసీఆర్‌ అంతం ఖాయమని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు