ప్రమాదం కానే కాదు.. నిర్లక్ష్యమే: కవిత

9 Jun, 2014 15:25 IST|Sakshi
ప్రమాదం కానే కాదు.. నిర్లక్ష్యమే: కవిత
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటన నిర్లక్ష్యమే కారణమని నిజమాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ నేత కే. కవిత ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మండీ ఘటన ప్రమాదం వల్ల జరిగింది కాదు.. నిర్లక్ష్యం కారణంగానే చోటు చేసుకుందని కవిత అన్నారు. ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేక పోవడం, అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడమే వల్లనే రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు మృత్యువాత పడ్డారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు కవిత సంతాపం వ్యక్తం చేశారు. 
 
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది  విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టింది.  నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ అప్పటివరకు ఉల్లాసంగా ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. 
మరిన్ని వార్తలు