Himachal Pradesh: హిమాచల్‌లోనూ సొరంగ ప్రమాదం.. ఎప్పుడంటే..

21 Nov, 2023 09:23 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలి 41 మంది కూలీలు చిక్కుకున్నారు. కార్మికులంతా క్షేమంగా ఉండడం, 10వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌లో  కార్మికులందరి ఫొటోలు బయటకు రావడం కాస్త ఊరట కలిగించింది.

కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో తొమ్మది ఏళ్ల క్రితం  కూడా ఇటాంటి సొరంగ ప్రమాదమే చోటు చేసుకుంది. నాటి ప్రమాదంలో ఇద్దరు కూలీలు సజీవంగా బయటపడ్డారు. ఒక కూలీ మృతి చెందాడు. సొరంగంలో చిక్కుకున్న ఈ  కూలీలు పది రోజుల పాటు ఆహారపానీయలు లేకుండా దయనీయ స్థితిలో కాలం గడిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని కిరాత్‌పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో 2015, సెప్టెంబరు 15న ఈ ప్రమాదం జరిగింది.  ఉత్తరాఖండ్‌లో మాదిరిగానే నాడు ఈ సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో కార్మికులు లోపల చిక్కుకుపోయారు. మొదట ఎంత మంది కార్మికులు లోపల చిక్కుకున్నారో తెలియరాలేదు. నాడు దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అప్పటి డీసీ మాన్సీ సహాయ్ నేతృత్వంలో జరిగింది. 

ఆయన ప్రస్తుతం హిమాచల్‌లో లేబర్ కమిషనర్‌గా ఉన్నారు. నాడు కిరాత్‌పూర్-మనాలి దగ్గరున్న సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు 211 గంటల 47 నిమిషాల సమయం పట్టింది. 42 మీటర్ల మేర సొరంగంలో డ్రిల్లింగ్ చేసిన అనంతరం రెస్క్యూ టీం ఇద్దరు కార్మికులను క్షేమంగా బయటకు తీసుకువచ్చింది. 
ఇది కూడా చదవండి: సొరంగంలో చిక్కుకున్నవారంతా క్షేమం.. ఫొటో విడుదల!

మరిన్ని వార్తలు