అమ్మతోడు.. అమ్మాయిగానే..

8 Mar, 2018 08:44 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో: మరో జన్మంటూ ఉంటే మళ్లీ అమ్మాయిగానే పుడతానంటున్నారు సిటీ అమ్మాయిలు. నిత్య జీవితంలో ప్రతిచోటా వివక్ష ఎదురైనా దానికి చరమగీతం పాడేందుకు ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. కొందరు ఇంట్లో వివక్షను ఎదుర్కొంటే.. పాఠశాల.. కళాశాల స్థాయిలో తాము అధికమార్లు వివక్షకు గురైనట్లు ఇంకొందరు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో కెరీర్‌లో అనుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు విరామమెరుగక శ్రమిస్తామని చాటిచెబుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేటర్‌ వ్యాప్తంగా బుధవారం ‘సాక్షి’ బృందం సుమారు వెయ్యి మంది కళాశాలల విద్యార్థినుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలను సేకరించింది. వారి అభిప్రాయాలిలా ఉన్నాయి..

సాక్షి సర్వే
1. మళ్లీ జన్మంటూ ఉంటేఎలా పుడతారు ?
ఎ.అమ్మాయి: 682
బి.అబ్బాయి: 187
సి.చెప్పలేం: 131

2. అమ్మాయిగా ఎప్పుడైనావివక్ష ఎదుర్కొన్నారా..?
ఎ.అవును: 549
బి.లేదు: 401
సి. చెప్పను: 50

3. మీరు ఎక్కడ వివక్ష ఎదుర్కొన్నారు?
ఎ.స్కూల్‌/కాలేజ్‌: 649
బి.ఇంట్లో: 309
సి.లేదు: 42

4. మీ ఆకాంక్షలకు అనుగుణంగాచివరి లక్ష్యాన్ని (లైఫ్‌గోల్‌) చేరుకోగలమనిభావిస్తున్నారా?
ఎ.అవును: 730
బి.కాదు: 207
సి. చెప్పలేను: 63

5. సంప్రదాయకెరీర్‌ ఎంచుకోవాలనుకుంటున్నారా.. లేదాఛాలెంజింగ్‌ జాబ్‌ చేయాలనుకుంటున్నారా?
ఎ. రిస్క్‌ ఎక్కువగా ఉండని జాబ్‌: 464
బి.ఛాలెంజింగ్‌ జాబ్‌: 489
సి.చెప్పలేను: 47

మరిన్ని వార్తలు