సినిమా చూపిస్తా మామా!

25 Jan, 2019 00:31 IST|Sakshi

ఆర్టీసీ బస్టాండుల్లో  మినీ థియేటర్లు

15 ప్రాంతాల్లో ఏర్పాటుకు టీఎఫ్‌డీసీ సుముఖం

ఏటా రూ. 3.11 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా

అధ్యయనానికి విజయవాడ వెళ్లనున్న ఆర్టీసీ అధికారులు  

సాక్షి, హైదరాబాద్‌: బస్టాండ్లలో వివిధ కారణాల వల్ల వేచి ఉండాల్సిన ప్రయాణికులకు శుభవార్త. తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియే టర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయిం చింది. ఆర్టీసీ ప్రతిపాదనకు తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎఫ్‌డీసీ) ముందుకు వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి, టికెట్టేతర ఆదాయం కోసం వివిధ మార్గాలు అన్వేషిస్తోన్న ఆర్టీసీకి ఈ ఆలోచన కాసులు కురిపిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మినీ థియేటర్ల నిర్మాణానికి చకాచకా అడుగులు వేస్తోంది.

త్వరలో విజయవాడకు బృందం..
టికెట్టేతర ఆదాయం పెంపులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలను వేలం వేసిన ఆర్టీసీ, ఇకపై మినీ థియేటర్లను ఏర్పాటు చేయనుందని సంస్థ తాత్కాలిక ఎండీ సునీల్‌ శర్మ వెల్లడించారు. ఇప్పటికే ఇందుకోసం ఆర్టీసీకి చెందిన 23 స్థలాలను గుర్తించామని, ఇందులో 15 ప్రాంగణాల్లో మినీ థియేటర్లు నిర్మించేందుకు టీఎఫ్‌డీసీ ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ థియేటర్ల ద్వారా ఏటా రూ. 3.11 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌లో ఇలాంటి మినీథియేటర్‌ నడుస్తోంది. ఈ మినీ థియేటర్‌ నిర్వహణ పని తీరును పరిశీలించేందుకు త్వరలోనే ఈడీ పురుషోత్తమ్‌ నేతృత్వం లోని బృందం విజయవాడ వెళుతుందని ఆయన వివరించారు. 

ఏయే ప్రాంతాల్లో..
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొల్లూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, ధర్మపురి, హుజూరాబాద్, సిరిసిల్ల, పెద్ద పల్లి, జడ్చర్ల, షాద్‌నగర్, నర్సా పూర్, సంగారెడ్డి, నాగార్జున సాగర్, కోదాడ, ఆర్మూర్, బోధన్, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్‌ బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హెరిటేజ్‌ ఓ జోక్‌లా మారింది!

7 కొత్త కార్పొరేషన్లు

నీళ్ల నిలువను, విలువను తెలిపే థీమ్‌పార్క్‌ 

నిలబెట్టుకోలేక నిందలా!

‘ఎన్‌కౌంటర్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందే ’

బీజేపీలో నాకు తలుపులు మూసుకుపోలేదు..

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఈనాటి ముఖ్యాంశాలు

కేటీఆర్‌.. మీతో ఛాయ్‌ కా, ఇంకేమైనా ఉందా?

మున్సిపల్‌ ఎన్నికలకు ఎందుకంత హడావుడి?

గెలుపు ఓటముల్లో అతివలదే హవా..

లక్ష మందితో బహిరంగ సభ: ఎమ్మెల్యే

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

రామయ్యా.. ఊపిరి పీల్చుకో 

బాలిక కిడ్నాప్‌ కలకలం 

మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

కాంగ్రెస్‌ సభ్యుల నిరసన; కేసీఆర్‌ స‍్పందన

మనకూ ‘ముంబై’ ముప్పు

‘కాంగ్రెస్‌ అనాథగా మారిపోయింది’

పట్నంలో అడవి దోమ!

ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు యువకులు

బైకుల దొంగ అరెస్ట్‌

కేఎంసీ వర్సెస్‌ ఎంజీఎం 

'మస్ట్‌'బిన్‌ లేకుంటే జరిమానాల దరువు

కొత్తపట్నం ఏర్పాటు ఇలా..

నీళ్లు ఫుల్‌

నగరంలోకి ఎలక్ర్టికల్‌ బస్సులు

వివాహేతర సంబంధం పెట్టుకుందని..

ద.మ.రై.. వంద రైళ్ల వేగం పెంపు..

అణచి వేసేందుకే మావోయిస్టు ముద్ర

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం