సినిమాలో నటించావా.. అని మంత్రి ఫైర్‌ !

28 Oct, 2017 17:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కార్పొరేటర్లతో మంత్రి సమావేశం శనివారం హాటాహాట్‌గా జరిగింది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు కార్పొరేటర్లకు తీవ్ర హెచ్చరికలు చేశారు. పనితీరు మార్చుకోకుంటే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయని కొందరికి స్పష్టం చేశారు. ముఖ్యంగా చైతన్యపురి, హయత్‌నగర్‌ కార్పొరేటర్లకు కేటీఆర్‌ చురకలంటించారు.

చైతన్యపురి నీ సామ్రాజ్యం అనుకుంటున్నావా ? అంటూ వ్యంగ్యంగా అడిగారు. అధికారులు మీ డివిజన్‌లలో తిరిగాలంటే నీ అనుమతి తీసుకోవాలా.? అని నిలదీశారు. ఈ విధమైనవి ఎక్కువ చేస్తే పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తానంటూ హెచ్చరించారు. సినిమాలో నటించావా.. అని హయత్‌ నగర్‌ కార్పొరేటర్‌ తిరుమల్‌ రెడ్డిని అడిగారు. వెంగళరావు నగర్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌.. కాఫీ విత్‌ కార్పొరేటర్‌ ప్రోగ్రాంను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రముఖంగా ప్రస్తావించారు. 

పార్టీకి కార్పొరేటర్లు కీలకమని, ఇష్టం వచ్చినట్లు చేయటం పద్ధతి కాదని ఆయన సూచించారు. అందరూ కలిసి జాగ్రత్తగా పని చేయండని కోరారు. అధికారులు ఇబ్బంది పెడితే తనకు చెప్పాలని కోరారు. అధికారుల వెంట పడి పని చేయించుకోవాలని కోరారు. వినూత్నంగా పని చేసి జనంలోకి వెళ్ళండని మంత్రి కేటీఆర్‌ సలహా ఇచ్చారు.


 
 

మరిన్ని వార్తలు