పంచాయతీ ఓటర్ల  జాబితాలను సిద్ధం చేయండి 

23 Nov, 2018 17:42 IST|Sakshi

పంచాయతీ కార్యదర్శులను ఆదేశించిన అధికారులు

జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం

 కొత్తఓటర్లకు అవకాశమివ్వాలి

కులాల వారీగా గణన కూడా పూర్తి చేయాలని ఆదేశం

 ఓటర్ల జాబితా సిద్ధం చేయడానికి గడువు ఈనెల 25వ తేది 

 సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిపోయిన దృ ష్ట్యా పంచాయతీలకు మూడు నెలల్లో ఎన్నికల ను నిర్వహించాలని హైకోర్టు ఆదేశించడంతో స రికొత్త ఓటర్ల జాబితాలను సిద్ధం చేయడానికి అ ధికారులు శ్రీకారం చుట్టారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి రెండో వారంలోగా పంచాయతీల ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. అయితే ముందస్తు శాసనసభ ఎన్నికలు, ఫలితాలు ము గిసిన తరువాత పంచాయతీల ఎన్నికల షెడ్యూ ల్‌ వెలువడే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను వెలువరించేనాటికి పంచాయతీ ల వారిగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి ఉద్యోగులకు నిర్దేశించారు. గతంలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారిగా ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. అయితే ముందస్తు ఎన్నికల నేప థ్యంలో ఓటు హక్కుకు అర్హత ఉన్నవారు దర ఖాస్తు చేసుకోవడానికి ఎన్నికల కమిషన్‌ అవ కాశం కల్పించింది.

దీంతో అనేకమంది ఓటర్ల జాబితాల్లో స్థానం దక్కించుకున్నారు. ఆయా శా సనసభ స్థానాల్లో కొత్త ఓటర్ల సంఖ్య పెరగడం తో కొత్త వారికి పంచాయతీ ఎన్నికల్లోను ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని ఎన్నికల సంఘం ని ర్ణయించింది.  అలాగే వార్డుల ప్రకారం జాబితాలను సిద్ధం చేసి కులాల గణను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొత్త ఓటర్ల జాబితాలను ఈనెల 25వ తేది వరకు సిద్ధం చే యాలని పంచాయతీ ఉన్నతాధికారులు రెండు రోజుల కింద ఆదేశించారు. నిజామాబాద్‌ జి ల్లాలో 530 గ్రామ పంచాయతీలు, కామారెడ్డి జి ల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జా బితాల్లో చేర్చిన ఓటర్లు ఏ వార్డులకు సంబంధించిన వారో కూడా విభజించాల్సి ఉంటుంది. గ తంలో ఓటర్ల జాబితాలను ముద్రించిన దృష్ట్యా కొత్తగా చేర్చే ఓటర్లను జాబితాల్లో రాతపూర్వకంగానే రాసి సిద్ధం చేయాలని పంచాయతీ అధికారులు సూచించారు. 

శాసనసభ ఎన్నికల కోసం కొత్తగా ముద్రించిన ఓటర్ల జాబితాలను పంచాయతీల కార్యదర్శులు సేకరించి కొత్తగా చేరిన వారు ఏ వార్డుకు చెందిన వారు అని గుర్తించాల్సి ఉంది. అలాగే కు లాల గణనను కూడా పూర్తి చే యాల్సి ఉంది.  ఓ టర్ల జాబితాల్లో మార్పులు చే ర్పులతో పాటు కు లాల వారిగా ఓటర్ల గణన కోసం కొన్ని రోజుల గడువు పెంచాలని కార్యదర్శులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు