దళిత నాయకుడిపై దురుసు ప్రవర్తన   

16 Aug, 2018 13:27 IST|Sakshi
అంబేద్కర్‌కు నివాళులర్పించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే డీకే అరుణ 

బీజేపీ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ ర్యాలీ

అమరచింతలో దళిత సంఘాలు, రాజకీయ నాయకుల ఆందోళన

అమరచింత (కొత్తకోట) : స్వాతంత్య్ర దినోత్స వాన్ని పురస్కరించుకుని బుధవారం అమరచింత మున్సిపాలిటీ కార్యాలయం వద్ద వివిధ పార్టీల నాయకులు గ్రామాభివృద్ధిపై ఉపన్యసించారు. ఇందులో భాగంగానే బీఎల్‌ఎఫ్‌ మండల కన్వీనర్‌ తిమ్మోతి దళితవాడల అభివృద్ధి మరుగున పడిందని సభాముఖంగా సమస్యలు తెలియజేస్తుండ గా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మేర్వరాజు అడ్డుతగిలి తిమ్మోతి చేతిలోని మైకును లాక్కుని దురుసుగా ప్రవర్తించడంతో మున్సిపల్‌ ఆవరణ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

చేతిలోని మైకును లా క్కోవడం ఏమిటని దళిత సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు మేర్వరాజుపై దాడికి యత్నించగా ఎస్‌ఐ రామస్వామి మున్సిపల్‌ కమిషనర్‌ పాండునాయక్‌ వివాదాన్ని సద్దుమణిగించే ప్ర యత్నం చేశారు. దీంతో దళిత సంఘాలు, రాజకీ య పార్టీల నాయకులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి మేర్వరాజుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ధర్నా నిర్వహించారు.

అనంతరం గ్రామంలో ర్యాలీ తీసి తహసీల్దార్‌ పాం డునాయక్, ఎస్‌ఐ రామస్వామిలకు వినతిపత్రా లు అందజేశారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు రాజు, అయూభ్‌ఖాన్, గోపి, మహం కాళి విష్ణు, చింతలన్న, ఫయాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, అజయ్, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

రోజులు దగ్గరపడ్డాయి.. 

మతతత్వాన్ని పెంచిపోషిస్తూ గోరక్ష పేరుతో దళితులపై దాడులు చేస్తున్న మతోన్మాద పార్టీలకు రో జులు దగ్గరపడ్డాయని మాజీమంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. అమరచింత మీదుగా ధన్వాడకు వెళ్తున్న ఆమె స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దళిత నాయకుడి చేతిలోని మై కును బీజేపీ నాయకుడు లాక్కోవడం దారుణమన్నారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అణ గారిన కులాలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలను విస్మరిం చి న సీఎం కేసీఆర్‌ అధికార దాహంతో సంక్షేమ ప థకాల పేర్లు వల్లిస్తూ ప్రజలను మోసగిస్తున్నారన్నా రు. రాహుల్‌గాంధీ నాయకత్వంలో దేశంలో, రా ష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చే యడం తథ్యమన్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ నిజాంపాష, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయూబ్‌ఖాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు