బిడ్డా.. జర పైలం

18 Apr, 2020 13:19 IST|Sakshi
క్షేమ సమాచారం తెలుసుకుంటూ..

విదేశాల్లో ఉంటున్న వారికోసం  

తపిస్తున్న కుటుంబ సభ్యులు

సాక్షి, వరంగల్‌ రూరల్‌ : కరోనా వైరస్‌ సుమారు 200పైగా దేశాల్లో విస్తరించి ఉంది. ఈ మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఉద్యోగాలు చేయడానికి, చదువుకోవడానికి ఇక్కడి నుంచి వివిధ దేశాలకు వెళ్లిన వారు అక్కడే ఉండిపోయారు. వారు ఎలా ఉన్నారని కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. దీంతో వీడియో కాలింగ్‌ ద్వారా యోగక్షేమాలు తెలుసుకుంటూ.. స్వాంతన చెందుతున్నారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు రోజుకు ఒకసారైనా విదేశాల్లోని పిల్లలతో మాట్లాడనిదే నిద్రపోవడంలేదంటే అతిశయోక్తికాదు.  

అక్కతో మాట్లాడితేకానీ నిద్ర పట్టదు..
దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన బొమ్మినేని ప్రియాంకరెడ్డి, భరత్‌రెడ్డి అక్కా తమ్ముళ్లు. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అమ్మ రమాదేవి పెంచి పెద్ద చేసింది. ప్రియాంకరెడ్డి పెళ్లి అనంతరం మూడేళ్లుగా భర్తతో కలిసి జర్మనీలో ఉంటోంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో రోజూ అక్కతో మాట్లాడితేగాని నిద్రపట్టడం లేదని భరత్‌రెడ్డి చెబుతున్నాడు.

క్షేమ సమాచారం తెలుసుకుంటూ..
పై ఫొటోలోని దంపతులు దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన పుచ్చకాయల రమాదేవి– బుచ్చిరెడ్డి. వీరికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కుమారులు, కోడళ్లు అమెరికాలో ఉద్యో గం చేస్తున్నారు. ఆ దేశంలో కరోనా వైరస్‌ వికృత రూపం దాల్చడంతో పిల్లల తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నిత్యం కుమారులు, కోడళ్లతో మాట్లాడిన తర్వాతే నిద్రపోతున్నారు. గతంలో  పది రోజుకోసారి మాట్లాడుకున్న వీరు ప్రస్తుతం నిత్యం క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు.

ఆందోళనగా ఉంది..
నల్లబెల్లి మండలం రాంపూ ర్‌ గ్రామానికి చెందిన చింతపట్ల ప్రమీల మోహన్‌రావు దంపతుల చిన్న కుమారు డు సతీష్‌ కోడలు స్పందన పదేళ్లుగా న్యూజెర్సీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పిల్లలు ఎలా ఉన్నారోనని దంపతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజులుగా నిద్రపట్టడంలేదని బాధపడుతున్నారు. కొడుకు, కోడలు, వారి పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు