ఓటింగ్‌ పరిశీలనలో పోలింగ్‌ ఏజెంట్లే కీలకం

22 Nov, 2018 11:41 IST|Sakshi
పోలింగ్‌ ఏజెంట్లు

అమ్ముడు పోతే అభ్యర్థి పరిస్థితి అంతే సంగతి 

 ఒక్క ఓటుతో కూడా ఓటమి చెందే అవకాశం 

 అత్యంత విశ్వాస పాత్రులే ఏజెంట్లుగా ఉండాలి 

సాక్షి, కామారెడ్డి అర్బన్‌: పోలింగ్‌ బూత్‌లో అభ్యర్థుల తరఫున పరిశీలన కోసం కూర్చుండే ఏజెంట్ల పాత్ర చాలా కీలకమైంది. బోగస్‌ ఓట్లు పడకుండా ఓటేయడానికి వచ్చే వారిని నిశితంగా చూడాలి. ఒక ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపోందే అవకాశం ఏన్నందున ఏజెంట్లుగా ఉండే వారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా వుండాలి. లేకపోతే ఇతర అభ్యర్థులకు అమ్ముడు పోయే సందర్భాలు కూడా ఉంటాయి. 

  • పోలింగ్‌ ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం ఇటీవల కొన్ని మార్పులు చేసింది. 
  • పోలింగ్‌ స్టేషన్‌లో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్రాల పార్టీలు, తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి పొందిన వారు, గుర్తింపు పొందని రిజిష్టర్‌ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఏజెంట్‌ కూర్చీలు వేస్తారు. 
  • పోలింగ్‌ ఏజెంట్లు తప్పనిసరిగా అదే గ్రామానికి చెందిన వారై ఉండి, ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి. 
  • ప్రతి పోలింగ్‌ స్టేషన్‌కు ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్‌ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్‌ ఏజెంట్లను నియమించుకోవచ్చు. 
  • పోలింగ్‌ ఏజెంట్‌ ఫారం–10లో పోటీ చేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంట్‌ నియామక పత్రం పొందినవారికి నిరూపణ డిక్లరేషన్‌పై ఏజెంట్‌ పాస్‌ జారీ చేస్తారు. 
  • ఒక్కో బూత్‌కు మూడు పాసులు జారీ చేసిన ఒక్క∙పో
  • రు మాత్రమే కూర్చోడానికి అనుమతి ఇస్తారు. ఓటర్ల జాబితాను బయటకు తీసుకువెళ్లేందుకు వీలు ఉండదు. 
  • లింగ్‌ ఏజెంట్లు ఓటింగ్‌ సమయానికి కనీసం గంటముందుగా బూత్‌కు చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి పక్రియ వారు చేసుకుపోతారు. ఆలస్యమయాతే ఓటింగ్‌ మిషన్ల సీల్‌లో ఏజెంట్‌ సంతకం చేయడం, పరిశీలన చేయలేకపోతారు. అలాగే ఓటింగ్‌ ముగిసిన అనంతరం కూడా ఈవీఎంల సీలింగ్‌ పక్రియను పర్యవేక్షించి దానిపై సంతకం చేయాలి. 
  • పోలింగ్‌ ఏజెంట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్, వైర్‌లెస్, కార్డ్‌లెస్‌ తీసుకుపోరాదు. పార్టీ కండువాలు, గుర్తులను ధరించరాదు. ఓట్లు వేయని ఓటర్ల సంఖ్యను సూచించి వెలుపలికి చీటీలను పంపడం నిషేధం. 
  • పోలింగ్‌ స్టేషన్‌లో జరిగే ప్రతి కదలిక, తతంగాన్ని ఏజెంట్‌ నిశితంగా పరిశీలించి ఏ మాత్రం అనుమానం కలిగినా ప్రిసైడింగ్‌ అధికారి, పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులకు ఫిర్యాదు చేయాలి. పోలింగ్‌పై    అభ్యంతరం తెలుపవచ్చు. 
  • పోలింగ్‌ సరళి కనిపించే విధంగా పార్టీ ప్రాధాన్యత ప్రకారం ఏజెంట్లకు కూర్చీలు ఏర్పాటు లేకుంటే ఫిర్యాదు చేయవచ్చు.  
  • సంఖ్య అసాధారణంగా ఉంటే ఏజెంట్లకు పోలింగ్‌ స్టేషన్‌లో ఏ విధంగానైనా సర్దుబాటు చేస్తారు.   
మరిన్ని వార్తలు