ఇక గ్లామర్‌కు సై!

22 Nov, 2018 12:01 IST|Sakshi

సినిమా: హీరోయిన్లకు అభినయం అవసరమే కానీ, ఈ తరంలో అంతకు మించి అందాలారబోత అవసరం. స్టార్‌ హీరోయిన్లుగా ఎదిగినవారంతా అంతా గ్లామర్‌ను నమ్ముకున్నవారే. ఈ విషయం కొంచెం ఆలస్యంగా నటి మాళవిక నాయర్‌కు అర్థమైనట్లుంది. ఈ అమ్మడు ఇకపై గ్లామర్‌కు హద్దులు చెరిపేసింది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గానే రంగప్రవేశం చేసిన ఈ ముద్దుగుమ్మ పలు కమర్శియల్‌ యాడ్స్‌లోనూ నటించింది. ఆ తరువాత 2013లో మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా అవకాశాన్ని అందుకుంది. ఇక 2014లో కుక్కూ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయింది. అలా అక్కడ, ఇక్కడా ఒక్కో చిత్రం చేస్తూ వచ్చిన మాళవిక నాయర్‌ ఎవడే సుబ్రమణ్యం చిత్రంతో టాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకూ వచ్చింది.

ఆ తరువాత కల్యాణ వైభోగమే చిత్రాలు చేసినా, తాజాగా టాక్సీవాలాతో మరో మంచి హిట్‌ను అందుకుంది. తమిళంలో కుక్కూ చిత్రంలో అంధురాలిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న ఈ భామ చాలా కాలం తరువాత ఇక్కడ అరసియల్ల ఇదెల్లాం సహజమప్పా చిత్రంలో నటిస్తోంది. మరో పక్క బీఏ చదువుతున్న ఈ అమ్మడు ఇకపై నటనపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. అదేవిధంగా  ఇప్పటి వరకూ గ్లామర్‌కు ఆమడ దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను తెచ్చుకున్న మాళవికనాయర్‌కు ఇప్పుడు కమర్శియల్‌ హీరోయిన్‌గా మారాలనే ఆశ పుట్టిందట. అలా కావాలంటే గ్లామరస్‌గా నటించాల్సిందే. అందుకూ సిద్ధమైపోయిందట. ఇకపై ఎలాంటి పాత్ర అయినా హద్దులు మీరని విధంగా అందాలారబోతకు మాళవికానాయర్‌ సిద్ధం అంటోందని çకోలీవుడ్‌ వర్గాల టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా