పవన్‌ గారూ హెల్ప్‌ మీ : పూనం కౌర్‌

8 Jan, 2018 13:39 IST|Sakshi

మహేశ్‌ కత్తి ప్రశ్నలపై స్పందించిన సినీ నటి

పొలిటికల్‌ టార్గెట్‌ కావడం ఇష్టంలేదని వ్యాఖ్య

వరుస ట్వీట్లు చేసిన పూనమ్‌.. నిమిషాల్లోనే తొలగింపు!

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌లోనేకాక రాజకీయంగానూ దుమారం రేపుతోన్న ‘మహేశ్‌ కత్తి- పవన్‌ ఫ్యాన్స్‌’ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో అనుబంధం నేపథ్యంగా మహేశ్‌ కత్తి సంధించిన ప్రశ్నలపై నటి పూనమ్‌ కౌర్‌ స్పందించారు. వివాదం నుంచి తనను బయటపడేయాల్సిందిగా పవన్‌ను సహాయం కోరారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం పూనమ్‌ తన అధికారిక ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే ఆ ట్వీట్లను డిలిట్‌ చేసేశారు. అయితే ఆ వ్యవధిలోనే పూనమ్‌ ట్వీట్లు వైరల్‌ అయ్యాయి. స్క్రీన్‌ షాట్ల రూపంలోని ట్వీట్లు విపరీతంగా షేర్‌ అవుతున్నాయి.

పవన్‌.. హెల్ప్‌ మీ : ‘‘పవన్‌ కల్యాణ్‌ గారూ.. ఈ విపత్కర పరిస్థితితో నాకు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎందుకంటే ఇది నా కుటుంబానికి, కెరీర్‌కు, మరీ ముఖ్యంగా నా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. రహస్య అజెండాతో పనిచేస్తోన్న ఎవరో కొందరికి నేను పొలిటికల్‌ టార్గెట్‌ కాదల్చుకోలేదు. ఇదే విషయమై మిమ్మల్ని స్వయంగా కలిసి, మాట్లాడాలనుకుంటున్నాను’’ అని పూనమ్‌ ట్వీట్లలో రాసుకొచ్చారు. పవన్‌ను ఉద్దేశించిన ట్వీట్లను నిమిషాల వ్యవధిలోనే డిలిట్‌ చేసేయడం గమనార్హం.

పూనమ్‌ కౌర్‌ ట్వీట్స్‌(డెస్క్‌టాప్‌ స్క్రీన్‌ షాట్‌)

కత్తి ప్రశ్నలు : ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో కత్తి మహేశ్‌ విలేకరులతో మాట్లాడుతూ.. వివాదాల విషయంలో తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని, పవన్‌ అభిమానులే ఉన్మాదులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తన వెనక ఏ రాజకీయ పార్టీ, మీడియా లేదని, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాననే ఆరోపణలు అవాస్తవమన్నారు. నటి పూనమ్‌కౌర్‌ చేసిన వ్యాఖ్యలకు తాను ఆరు ప్రశ్నలు సంధిస్తున్నానన్నారు.
పూనమ్‌కౌర్‌కు కత్తి మహేష్‌ సంధించిన ప్రశ్నలివే..
1. చేనేత బ్రాండ్‌ అంబాసిడర్‌ హోదా పూనమ్‌కౌర్‌కు ఎలా లభించింది?
2. తిరుమలలో పవన్‌ గోత్రం పేరుతో పూజ చేసింది నిజం కాదా?
3. పవన్‌ మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం చేసింది నిజం కాదా? ఆస్పత్రి బిల్లు ఎవరు కట్టారు?
4. పూనమ్‌ తల్లిని కలిసిన పవన్‌ చెవిలో ఏం చెప్పాడు? ఏం ప్రామిస్‌ చేశారు?
5. దర్శకుడు త్రివిక్రమ్‌ అంటే ఎందుకు కోపం?
6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగ్‌తో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు?

మరిన్ని వార్తలు