చురుగ్గా సాగుతున్న బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

5 Feb, 2018 19:14 IST|Sakshi
ఐదంతస్తుల రాజగోపురం

కీసర : కీసరగుట్టలో ఈనెల 11 నుంచి 16వ తేది వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన ఆలయం, ఆంజనేయస్వామి విగ్రహానికి , మహా మండపపంకు రంగులు వేశారు. పనులు జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి జిల్లా యంత్రాంగంతో రెండుసార్లు సమావేశమై పనులను ఈనెల 5, 6 తేదిల్లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. దీంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. హుడాపార్కు నుంచి ఉత్తర ద్వార గుండా స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లు, భక్తులు సేదతీరేందుకు ఆంజనేయస్వామి దేవాలయం పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్ల ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయి. యాత్రికులు సేదతీరే గుట్ట దిగువ ప్రాంతంలోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌ను చదును చేస్తున్నారు. అదే విధంగా మరుగుదొడ్ల ఏర్పాటు, పార్కింగ్‌ లాట్‌ల ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి.

యాత్రికులకు అన్ని ఏర్పాట్లు:
సామాన్య భక్తులకు దర్శనంలో ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏరాట్లు చేశాం. స్వామివారిని ఒకేసారి నలుగురు దర్శించుకునే విధంగా క్యూౖలైన్లు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వీవీఐపీలకు స్వామి దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్‌ ఏర్పాటు చేశాం. ప్రసాదం కొరత రాకుండా ప్రత్యేక దృష్టి సారించాం.-ఆలయ ఛైర్మన్‌ తటాకం రమేష్‌శర్మ

మరిన్ని వార్తలు