దివ్యాంగ ఓటర్లకు సౌకర్యాలు కల్పించాలి

7 Nov, 2018 16:21 IST|Sakshi
వీసీలో పాల్గొన్న కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

ఓటు హక్కు లేకపోతే  వారివద్దకు వెళ్లి కల్పించాలి 

వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌

 సాక్షి,ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): అర్హత గల దివ్యాంగులను ఓటరుగా నమోదు చేయడానికి క్షేత్ర స్థాయిలో అధికారులతో పాటుగా స్వయం సహాయక సంఘాలు, ఆయా స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. మంగళవారం దివ్యాంగ ఓ టర్లు, పోలింగ్‌ సిబ్బంది అంశాలపై హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు పోలింగ్‌ కేం ద్రాల్లో ప్రత్యేక వసతులతో పాటుగా వీల్‌చైర్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. స్థానికంగా ఎన్ని వీల్‌చైర్‌లు లభ్యమవుతాయో పరిశీలన చేయాలని, అదనంగా అవసరమైన వాటికి టెండరు పిలిచి సమకూర్చడం జరుగుతుందన్నారు.

పోలింగ్‌ సి బ్బంది అదనంగా 20 శాతం సిబ్బంది రిజర్వుగా ఉండాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ రా మ్మోహన్‌ రావు మాట్లాడుతూ.. దివ్యాంగులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో 15,800 దివ్యాంగ ఓటర్లు ఉన్నారని సీఈవోకు తెలిపారు. ఇంకా అర్హత గల వారికి ఓటర్లుగా న మోదు చేయడానికి క్షేత్రస్థాయి అధికారులకు ఆదే శాలు జారీ చేసినట్లు చెప్పారు. 985 వీల్‌చైర్‌లు అవసరం ఉంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో కలెక్టర్‌తో పాటు డీఆర్వో అంజయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.


దివ్యాంగుల సదుపాయాలపై  చర్యలు తీసుకోవాలి 
 సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్): దివ్యాంగులకు అవసరమైన ట్రా న్స్‌పోర్టు, ర్యాంపులను, వీల్‌చైర్‌లను పోలింగ్‌ కేం ద్రాల వద్ద ఏర్పాటు చేయడానికి ఎన్నికల రిటర్నిం గ్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. జిల్లా కేంద్రం లోని ఆర్డీవో కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని ఆయా మండలా ల అధికారులతో మాట్లాడారు. డిసెంబర్‌ 2 లోగా బూత్‌స్థాయి అధికారులు, ఏజెంట్లు, ఫొటో ఓటర్‌ స్లిప్‌లను పంపిణీ చేసే విధంగా చూడాలన్నారు. రైట్‌టు డిసేబుల్‌ యాక్ట్‌ ప్రకారం దివ్యాంగులకు స దుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు, పార్లమెంట్‌లు సూచిస్తున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, డీపీవో రాములు, నోడల్‌ అధికారి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు