సంక్రాంతికి ఊరెళుతున్నారా? ఇది చదవాల్సిందే..

9 Jan, 2018 09:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలుగువారు ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండుగ దృష్ట్యా అటు రైల్వే, ఇటు ఆర్టీసీలు ప్రత్యేక సర్వీసులు అందిస్తున్నాయి. వివిధ ప్రాంతాల మధ్య 84 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు ప్రకటించగా, మొత్తం 3,262 స్పెషల్‌ బస్సులను సిద్ధం చేసినట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఇక దక్షిణమధ్యరైల్వే ప్రధాన కేంద్రం సికింద్రబాద్‌ స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచారు. ఈ పెంపు తాత్కాలికమేనని, సంక్రాంతి రద్దీ దృష్ట్యా జనవరి 11 నుంచి 17 వరకు పెరిగిన ధరలు అమలవుతాయని పౌరసంబంధాల అధికారి ఉమాశంకర్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పండుగ సీజన్లలో రైళ్లు ఎక్కేవారికంటే వారికి తోడ్కోలు, వీడ్కోలు కోసం ఫ్లాట్‌ఫాంపైకి వచ్చేవారితో రద్దీ పెరుగుతుండటంతో దానిని నియంత్రించేందుకే ధరలు పెంచుతుండటం తెలిసిందే.

సంక్రాంతి స్పెషల్‌ రైళ్లు : పండుగ సందర్భంగా రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుపతి–విశాఖపట్టణం, కాచిగూడ–విశాఖ, తిరుపతి–కాచిగూడ, హైదరాబాద్‌–విశాఖ, సికింద్రా బాద్‌– దర్బం గా, హైదరాబాద్‌– రెక్సాల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు తిరుపతి–విశాఖ (07487/07488) ప్రత్యేక రైలు ఈ నెల 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 10.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు విశాఖ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 7.20 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10 కు తిరుపతికి చేరుతుంది. కాచిగూడ–విశాఖ (07016) స్పెషల్‌ ట్రైన్‌ ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 6.45కు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.50కి విశాఖ చేరుతుంది.
విశాఖ–తిరుపతి(07479) స్పెషల్‌ ట్రైన్‌ : ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో సాయంత్రం 7.05 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.25కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి– కాచిగూడ (07146) స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 8, 15, 22, మార్చి 1 తేదీల్లో సాయంత్రం 5 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30కు కాచిగూడ చేరుకుంటుంది.
హైదరాబాద్‌–విశాఖ(07148/07147) స్పెషల్‌ ట్రైన్‌ : ఈ నెల 10, 12 తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.45 కి విశాఖ చేరుతెంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 11, 13 తేదీల్లో సాయంత్రం 6.50 కు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.45 కు నాంపల్లి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–దర్భంగా(07007/07008) స్పెషల్‌ ట్రైన్‌ ఫిబ్రవరి 3, 6, 10, 13, 17, 20, 24, మార్చి 3, 6, 10, 13, 17, 20, 24, 27, 31తేదీల్లో రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రెండోరోజు మధ్యాహ్నం 1.45కు దర్భంగా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 9, 13, 16, 20, 23, 27, మార్చి 2, 6, 9, 13, 16, 20, 23, 27, 30 తేదీల్లో ఉదయం 5 గంటలకు దర్భంగా నుంచి బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10.10కు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌ –రెక్సాల్‌ (07005/07006) స్పెషల్‌ ట్రైన్‌ ఫిబ్రవరి 1, 8, 15, 22, మార్చి 1,8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటకు నాంపల్లిలో బయలుదేరి రెండోరోజు సాయంత్రం 5.30కు రెక్సాల్‌ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్‌ 1 తేదీల్లో తెల్లవారు జామున 1.30 కు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 11.15 కు నాంపల్లి చేరుకుంటుంది.

స్పెషల్‌ బస్సులు : జనవరి 10 నుంచి 13 వ తేదీ వరకు బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజినల్‌ మేనేజర్‌ యాదగిరి తెలిపారు. దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ప్రత్యేక బస్సులపై 50 శాతం అదనపుచార్జీలు వసూలు చేయనున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు రోజూ నడిచే 3,065 రెగ్యులర్‌ బస్సులతోపాటు 3,262 ప్రత్యేక బస్సులను సిద్ధంచేశారు. విజయవాడ వైపు 1,094 బస్సులు, కర్నూల్‌ వైపు 115, నెల్లూరు 143, వరంగల్‌ 384, కరీంనగర్‌ 280, ఖమ్మం 430, మహబూబ్‌ నగర్‌ 179, ఆదిలాబాద్, నిజామా బాద్‌ జిల్లా లకు 259, నల్లగొండ 228, మెదక్‌ 125, బెంగ ళూరు 15, చెన్నై 5, పూణే వైపునకు 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో రద్దీని నియం త్రించేందుకు ప్రత్యేక బస్సులను నగర శివార్ల నుంచి నడి పేందుకు చర్యలు తీసుకున్నారు. ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్, ఎల్బీనగర్, బీహెచ్‌ ఈఎల్, కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు, జీడిమెట్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతారు.

మరిన్ని వార్తలు