భూముల ధరలు పెంపు..?

15 Jun, 2015 09:35 IST|Sakshi

ఆదాయం పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్లశాఖ నిర్ణయం
 మందగించిన స్థిరాస్తి వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ మార్గాలను అన్వేషించడం ఆరంచింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టాలంటే భూముల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చింది. అన్ని రకాల భూములపై ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ కంటే 60 శాతం పెంచాలని నిర్ణయించింది.
నల్లగొండ : జిల్లాలో కొన్ని రోజులుగా రియల్‌భూం స్తబ్దుగా ఉండడంతో రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయమూ తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయం రాబట్టుకునేందుకు భూముల రేట్లు పెంచాలని ఆ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత గతేడాది కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి కంటే రూ.82.13 కోట్ల ఆదాయం తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం రూ.234.8 6 కోట్లు కాగా..కేవలం రూ.152.73 కోట్లు మాత్రమే సమకూరింది. దీంతో పునరాలోచించిన ప్రభుత్వం భూములు ధరలు పెంచాలని భావించింది. 2013లో చివరిసారిగా భూముల ధరలు పెంచారు. మళ్లీ రెండేళ్ల విరామం తర్వాత భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియల్ వ్యాపారులను అయోమయానికి గురిచేస్తోంది. గతంలో అనామలీస్ పద్ధతిలో అన్ని వ్యవసాయ భూములపై కాకుండా భారీగా కొనుగోళ్లు జరుగుతున్న గ్రామాలను గుర్తించి మార్కెట్ ధరను పెంచేవారు.

కానీ ఈసారి అలాకాకుండా అన్ని రకాల భూములపై ప్రస్తుతం మార్కెట్ విలువ కంటే 60 శాతం పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వె నక కారణాలు లేకపోలేదు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి పర్చడంతోపాటు, సాగు, తాగునీటి రంగాలకు సంబంధించి పెద్దపీట వేసింది. అదీగాక గత రెండు, మూడు మాసాల కాలంలో హైదరాబాద్, నల్లగొండకు ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో కొత్తగా అనేక వెంచర్లు వెలిశాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భూములు ధరలు పెంచి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు పావులు కదుపుతోంది.
 అప్రమత్తమైన వ్యాపారులు...
 భూములు ధరలు పెరగబోతున్నాయన్న వార్తతో వ్యాపారులు అప్రమత్తమయ్యా రు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకోసారి (ఏప్రిల్), పట్టణ ప్రాం తాల్లో ప్రతి ఏడాది (ఆగస్టు)లో ఒకసారి మార్కెట్ ధరను పెంచుతారు. కానీ రెం డేళ్ల నుంచి భూముల ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడంతో ప్రభుత్వం ఏకబికి న ధరలు పెంచేందుకు సిద్ధమైంది. దీంతో వ్యాపారులు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు చకచకా పూర్తిచేసుకుంటున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో కలిపి ప్రభుత్వానికి రూ.33.98 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఈ రెండు మాసాలు కలిపి ప్రభుత్వానికి కేవలం రూ.16 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రధానంగా యాదిగిరిగు ట్ట రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో నాలుగింతల ఆదాయం పెరిగింది. గతేడాది ఏప్రిల్, మే మాసాల్లో రూ.2.70 కోట్లు ఆదాయం వస్తే...ఈ ఏడాది రెండు మాసాల్లోనే రూ.7.20 కోట్లకు చేరింది. యాదాద్రి అభివృద్ధిపై గురిపెట్టిన వ్యాపారులు వందల ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ఆయకట్టు ప్రాంతాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగానే జరిగాయి.   
 కమిటీల ఏర్పాటు...
 భూముల విలువ అంచనా వేసేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ల శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో భూముల మార్కెట్ విలువకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. రియల్ వ్యాపారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. అనామలీస్ పద్ధతిలో భూ ము విలువ లెక్కించాలని వ్యాపారులు సూచిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం అన్ని రకాల వ్యవసాయ భూముల ధరలు 60 శాతం పెంచే విధంగానే ముందుకుపోతున్నారు. జూలై నాటికి ఈ కసరత్తు పూర్తిచేస్తారు. ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

మరిన్ని వార్తలు